BigTV English

Dengue Fever : డెంగ్యూ ఫీవరా.. ఈ రసాలు తాగితే త్వరగా కోలుకుంటారు

Dengue Fever : డెంగ్యూ ఫీవరా.. ఈ రసాలు తాగితే త్వరగా కోలుకుంటారు

Juices for Dengue Fever : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆస్పత్రులన్నీ జ్వర బాధితులతో నిండిపోతాయి. వైరల్ ఫీవర్లతో పాటు.. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు ప్రబలే అవకాశాలు ఎక్కువ. ఇవి ప్రాణాంతకం కూడా. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. డెంగ్యూ జ్వరం వచ్చినవారికి ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. కోమాలోకి వెళ్లి .. ప్రాణం పోయేంత ప్రమాదకరం డెంగ్యూ జ్వరం.


డెంగ్యూ వచ్చినవారు ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తరచూ వాటి నుంచి రసాలు తీసి తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి.. త్వరగా కోలుకుంటారు. ప్లెట్ లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. డెంగ్యూ వచ్చినవారికి బొప్పాయి ఆకురసం, బొప్పాయి జ్యూస్ ఇస్తారన్న విషయం తెలిసిందే. వాటితోపాటు మరికొన్ని రసాలను కూడా తీసుకోవచ్చు.

వాటిలో మొదటిది.. ద్రాక్షరసం. డెంగ్యూ ఫీవర్ వచ్చినవారు ద్రాక్షరసం తీసుకుంటే బలహీనత, నీరసం తగ్గి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డెంగ్యూ కణాలతో పోరాడే శక్తి వస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. డెంగ్యూవచ్చిన ఆడవారికి రక్తస్రావం అధికంగా ఉంటుంది. వారు ద్రాక్షరసం తీసుకుంటే.. రక్తం పడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.


Also Read :వానాకాలంలో హార్ట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

సొరకాయ రసం. సాధారణంగా సొరకాయ కూర తినేందుకే చాలా మంది ఇష్టపడరు. కానీ.. సొరకాయతో చేసిన రసం తాగితే డెంగ్యూ ఇట్టే తగ్గుతుంది. సొరకాయలో ఉండే సద్గుణాలు డెంగ్యూ వల్ల వచ్చే రక్తపోటును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరగడంతో సహాయపడుతుంది.

బొప్పాయిరసం. డెంగ్యూ బాధితులు త్వరగా కోలుకునేందుకు మొదటగా ఇచ్చేది బొప్పాయిరసాన్నే. బొప్పాయి ఆకులు, పండ్లలో ఎన్నో పోషకాలుంటాయి. బొప్పాయి పండు జ్యూస్ తాగినా చాలా రిలీఫ్ ఉంటుంది. ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. డెంగ్యూ కారణంగా వచ్చే తీవ్రమైన ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయి.

నారింజరసం.. డెంగ్యూ జ్వరం వచ్చినవారికి తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయి. వారికి నారింజ రసాన్ని తాగిస్తే.. నొప్పులు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

 

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×