Massage benefits: మన శరీరానికి మసాజ్ అంటే కేవలం సుఖాన్నిచ్చే ప్రక్రియ కాదు. అది మన ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, మనసుకు శాంతినిచ్చే ఒక ఔషధం లాంటిది. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, శరీర నొప్పులు చాలా మందిని వేధిస్తున్నాయి. వీటినుంచి ఉపశమనం పొందడానికి అత్యంత ప్రాచీనమైన చికిత్స పద్ధతి మసాజ్. ఈ రోజు మనం 5 రకాల మసాజ్ విధానాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
అయుర్వేద మసాజ్
అయుర్వేదంలో శరీర శుద్ధి, రక్త ప్రసరణ, మానసిక ప్రశాంతత కోసం చేసే మసాజ్‌ను అత్యంత పవిత్రమైనది అంటారు. ఇది ప్రధానంగా హర్భల్ ఆయిల్స్‌తో చేస్తారు. ఆయుర్వేద నూనెలతో మసాజ్ చేయడం వలన శరీరంలోని రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. చర్మం మెరిసిపోతుంది. ముఖ్యంగా ఈ మసాజ్ వయసుతో వచ్చే నొప్పులు, జాయింట్ పెయిన్ వంటి సమస్యలకు అద్భుత ఫలితాలను ఇస్తుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ మసాజ్ చేస్తే శరీరానికి నూతన శక్తి లభిస్తుంది.
స్వీడిష్ మసాజ్
ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మసాజ్ పద్ధతి. దీన్ని సాఫ్ట్ ప్రెజర్‌తో, లేత ఆయిల్ లేదా లోషన్ సహాయంతో చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం శరీరంలోని మసిల్ టెన్షన్‌ను తగ్గించడం. రోజువారీ ఒత్తిడి, గాయం వల్ల వచ్చే నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకరం. ఈ మసాజ్ చేసిన తర్వాత మనసుకు ఒక ప్రశాంతత, శరీరానికి సుఖాన్ని అందిస్తుంది.
హాట్ స్టోన్ మసాజ్
ఇది ఒక ప్రత్యేకమైన థెరపీ. వేడి రాళ్లను కొన్ని ప్రత్యేకమైన పాయింట్లపై ఉంచి చేస్తారు. ఈ వేడి శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది, మసిల్స్‌కి రిలాక్సేషన్ ఇస్తుంది. చాలామంది దీన్ని నిద్రలేమి, ఒత్తిడి, మానసిక ఆందోళనల నివారణ కోసం చేస్తారు. హాట్ స్టోన్ మసాజ్ చేసిన తర్వాత శరీరం తేలికగా, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
Also Read: Amazon iPhone Offers: రూ.70,155కే ఐఫోన్ 17 ప్రో.. అమెజాన్ మెగా డీల్ వివరాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
షియాట్సు థెరపీ
షియాత్సు అనేది జపాన్‌లో పుట్టిన పద్ధతి. ఇక్కడ మసాజ్‌ను ఆయిల్ లేకుండా, వేళ్లతో మరియు పీడన పాయింట్లపై నెమ్మదిగా ప్రెజర్ పెట్టి చేస్తారు. ఇది శరీరంలోని ఎనర్జీ ఫ్లోను సరిచేస్తుంది. కండరాల బిగుసుకుపోవడం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకు ఈ థెరపీ అద్భుతమైన పరిష్కారం. ముఖ్యంగా రోజూ కుర్చీ దగ్గర కూర్చునే ఉద్యోగులు, స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉండే వారు దీనివల్ల చాలా రిలీఫ్ పొందగలరు.
డీప్ టిష్యూ మసాజ్
ఇది శరీరంలోని లోతైన మసిల్ లేయర్స్‌కి చేరే పద్ధతి. దీని ద్వారా గాఢమైన ఒత్తిడిని ఉపయోగించి శరీరంలోని గట్టిపడిన మసిల్స్, పాత గాయాలు, జాయింట్ నొప్పులను తగ్గిస్తారు. క్రీడాకారులు ఎక్కువగా ఈ మసాజ్‌ను చేసుకుంటారు. ఇది శరీరాన్ని సడలించి, బలాన్ని పెంచి, తిరిగి వ్యాయామానికి సిద్ధం చేస్తుంది.
మసాజ్ వల్ల లభించే సమగ్ర ప్రయోజనాలు
ఈ మసాజ్ పద్ధతులు మన రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. నిద్ర నాణ్యతను పెంచుతాయి. శరీరంలో టాక్సిన్స్‌ని బయటకు పంపుతాయి. ముఖ్యంగా మనసులోని ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక ఒత్తిడులను తగ్గించి ఒక కొత్త ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
వారానికి కనీసం ఒకసారి
ఒక మసాజ్ సెషన్ కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనసుని కూడా శాంతింపజేస్తుంది. అందుకే ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో వారానికి కనీసం ఒకసారి మసాజ్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు. మీ జీవితంలో ఈ పద్ధతులలో మీకు సరిపడే ఒక మసాజ్‌ను ఎంచుకోండి. అది మీ ఆరోగ్యం, మీ ఆనందం రెండింటినీ పెంచుతుంది.