BigTV English

Viral Beauty hack: చెవులకు ఇలా రబ్బరు బ్యాండ్లు పెట్టుకుంటే చాలట, ముఖం అందంగా మారిపోతుంది

Viral Beauty hack: చెవులకు ఇలా రబ్బరు బ్యాండ్లు పెట్టుకుంటే చాలట, ముఖం అందంగా మారిపోతుంది

ఎక్కువగా నిద్ర పోయినా లేదా నిద్ర సరిగ్గా పట్టకపోయినా ముఖం ఉబ్బినట్టు అవుతుంది. ఇలా ఎంతోమందికి జరిగే ఉండొచ్చు. ఆ ముఖం మీద ఉన్న పఫ్పీనెస్ ను లేదా ఉబ్బును తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక బ్యూటీ హ్యాక్ వైరల్ గా మారింది. చెవులకి రబ్బర్ బ్యాండ్‌లు పెట్టుకోవడం ద్వారా ముఖంపై ఉన్న ఉబ్బును లేదా పఫీనెస్ ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.


బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక చిట్కాను పంచుకుంది. తన ముఖం ఉబ్బినట్టుగా ఉందని, దాన్ని సరి చేసుకోవడానికి చెవులకు రబ్బర్ బ్యాండ్ లు పెట్టుకుంటున్నట్టు చెప్పింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్‌లో ఈ బ్యూటీ హ్యాక్ ఎంతో వైరల్‌గా మారింది. అయితే ఇలా చెవులకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చా? పఫీనెస్‌ను తగ్గించుకోవచ్చా? ఇది ఎలా జరుగుతుంది?

ఇది ఎలా పనిచేస్తుంది?
చెవులకు వీడియోలో చూపించినట్టు రెండు రబ్బర్ బ్యాండ్లను పెట్టడం వల్ల చెవులలోని కొన్ని పాయింట్లు పై తేలికపాటిగా ఒత్తిడి పెరుగుతుంది. ఇది ముఖంలో శోషరస ప్రసరణప ప్రభావం చూపిస్తుంది. ముఖంలో చేరిన అదనపుద్రవాన్ని బయటకు పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముఖంపై ఉన్న అదనపు ద్రవం బయటికి పోతే ముఖం పైన ఉన్న ఉబ్బుతనం తగ్గిపోతుంది. అప్పుడు ముఖం అందంగా అనిపిస్తుంది.


చెవులకు రబ్బర్ బ్యాండ్‌లు పెట్టిన తర్వాత అక్కడ చర్మం కాస్త బిగుతుగా, ఎర్రగా మారడం గమనిస్తారు. ఆ ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గి కాస్త చికాకుగా అనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా తాత్కాలికమైనదే. కొన్ని నిమిషాలలో ఆ రబ్బర్ బ్యాండ్లను తీసేయవచ్చు. ఈ బ్యూటీ హ్యాక్ వల్ల జరిగే ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే చెవులు చుట్టూ బిగుతుగా, రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల చికాకుగా అనిపిస్తుంది. ఎర్రగా మారుతుంది అక్కడ రక్తప్రసరణకు అంతరాయం కలుగుతుంది.

ఇలా కూడా చేయచ్చు
పైన చెప్పిన పద్ధతిలో పాటించడం మీకు ఇష్టం లేకపోతే ముఖం మీద ఉన్న పఫ్పీనెస్‌ను తగ్గించుకోవడానికి కొన్ని రకాల చిట్కాలను పాటించవచ్చు. ముఖానికి ఐస్ క్యూబ్స్ రాయడం వల్ల కొంతవరకు ముఖంపై ఉబ్బుతనం తగ్గుతుంది. అలాగే ఎక్కువ నీటిని తాగడం ద్వారా కూడా ఈ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఉప్పును ఆహారంలో తగ్గిస్తే ముఖం ఉబ్బడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే లింఫాటిక్ డ్రైనేజ్ మసాజ్ చేయడం కూడా మంచిది. ఇది ఎలా చేయాలో యూట్యూబ్ లో ట్యుటోరియల్ చూడండి. అలాగే రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. ముఖ్యంగా తలను కొంచెం ఎత్తుగా ఉండేలా తలగడను పెట్టుకోవడం మంచిది.

మలైకా అరోరా పాటించిన రబ్బర్ బ్యాండ్ బ్యూటీ చిట్కా ను మీకు ఫాలో అవ్వాలి అనిపిస్తే… రెండు చెవులకు రెండు రబ్బర్ బ్యాండ్లను పెట్టుకొని ఐదు నిమిషాలు పాటు ఉండండి. ఐదు నిమిషాల్లో మీరు ఏ పనులు చేసుకున్నా సమస్య లేదు. ఆ తర్వాత తీసేయండి. ఇది మీకు ఎంతగా ప్రయోజనకరంగా ఉందో చెప్పండి.

?utm_source=ig_web_copy_link">

?utm_source=ig_web_copy_link

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×