IndiGo flight: అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత మెయింటెనెన్స్‌పై దృష్టి పెట్టాయి ఎయిర్‌లైన్స్ సంస్థలు. ఏ చిన్న తేడా వచ్చినా దాని ఫలితాలను అస్సలు ఊహించలేము. మొన్నటికి మొన్న విమానం రెక్కలో పక్షి గూడు కనిపించగా, తాజాగా తేనె తీగల గుంపు వంతైంది. వాటి ఫలితంగా విమానం గంటసేపు ఆలస్యమైంది. అసలేం జరిగింది.
సోమవారం సూరత్ ఎయిర్‌పోర్టు నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం తేనెటీగల గుంపు వల్ల దాదాపు గంట ఆలస్యమైంది. నాలుగున్నరకు బయలుదేరాల్సిన ఆ విమానం చివరకు గంట ఆలస్యంతో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. తీనెతీగల వ్యవహారానికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
విమానాశ్రయ వర్గాల సమాచారం మేరకు.. 6E-7285 నెంబర్ గల ఇండిగో విమానంలోకి సామాన్లు ఎక్కిస్తున్నారు. ఆ సమయంలో అందుకు సంబంధించిన డోర్ ఓపెన్ చేశారు. అదే సమయంలో వేలాది తేనెటీగలు విమానం లగేజీ ఓపెన్ చేసిన తలుపుపై వాలాయి. అక్కడి నుంచి వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. వాటిని చూడగానే విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు.
మెయింటెనెన్స్ డిపార్టుమెంట్‌కి సమాచారం ఇచ్చారు. ఆ సిబ్బంది రంగంలోకి దిగారు. తొలుత తేనెటీగలను చెదరగొట్టడానికి పొగను ప్రయోగించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు. వాటర్ స్ప్రే ఉపయోగించిన తర్వాతే అవన్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఈ విషయాన్ని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
ALSO READ: హైదరాబాద్ జూపార్కులో నైట్ సఫారీ.. ఎప్పటి నుంచి అంటే..
సూరత్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇదే తొలిసారని అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. ఇండిగో విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది.
తేనెటీగల సమూహం ఎక్కడి నుంచి వచ్చేందనేది దర్యాప్తు చేస్తామన్నారు అధికారులు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా అటవీ, వన్యప్రాణుల విభాగాలతో సమన్వయం చేసుకుంటామన్నారు. తేనెతీగల వ్యవహారం సిబ్బందికి మేల్కొలుపుగా చెప్పారు. వర్షాకాలం కాకుండా అన్నివేళలా విమానాలను తనిఖీలను బలోపేతం చేస్తామని సూరత్ విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు.
గత ఏడాది జూలైలో ముంబై నుండి బరేలీకి ప్రయాణిస్తున్న మరో ఇండిగో విమానాన్ని తేనెటీగల గుంపు హైజాక్ చేసింది. తేనెటీగలు ఇండిగో విమానం 6E 5316 పై దాడి చేసి దానిని ఆలస్యం చేశాయి. ఉదయం 10.40 గంటలకు బయలుదేరాల్సిన విమానం చివరికి మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరింది.
*मधुमक्खियों ने रोकी इंडिगो की सूरत-जयपुर फ्लाइट:* लगेज गेट पर जमे झुंड को हटाने के लिए पहले धुआं किया, फिर पानी की बौछार की ..!! pic.twitter.com/4Sk5YN26xG
— MANOJ SHARMA/ मनोज शर्मा (@manojpehul) July 7, 2025