Female Smokers In India: మన దేశంలో స్మోకింగ్ అనేది శతాబ్దాలుగా ఉంది. అయితే, పురుషులతో పోల్చితే స్త్రీలే ఎక్కువగా పొగతాగుతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు స్మోకింగ్ చేసే దేశం ఇండియా. అమెరికా, యూరప్ మహిళలను చూసి.. వాళ్లు మోడ్రన్ గా ఉంటారు కాబట్టి, ఎక్కువగా స్మోక్ చేస్తారేమో అనుకుంటాం. కానీ, మన దేశంలో ఉన్న సంస్కారవంతమైన మహిళలే వాళ్ల కంటే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం గతకొద్ది సంవత్సరాలలో మన దేశంలో స్మోకింగ్ చేసే మహిళలు 6.2 శాతం పెరిగారు. పురుషులు కేవలం 2.3 శాతం పెరిగారు. మనదేశంలో స్మోకింగ్ చేసే మహిళలు యావరేజ్ గా 7 సిగరెట్లు తాగితే, పురుషులు 6 తాగుతున్నారు. ఇందులో కూడా మహిళలే ముందున్నారు.
పురుషుల కంటే మహిళలకే ప్రమాదం
నిజానికి సిగరెట్ స్మోకింగ్ అనేది పురుషులతో పోల్చితే స్త్రీలకే ప్రమాదకరం. ఒక అధ్యాయం ప్రకారం స్మోకింగ్ అనేది పురుషుల కంటే స్త్రీలకు 24 శాతం ఎక్కువగా హాని చేస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. స్మోకింగ్ చేసే మహిళల్లో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పురుషులలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్మోకింగ్ అనేది మగవాళ్లే కాదు, మహిళలకు కూడా చాల డేంజరస్. పురుషు, స్త్రీలు అనే తేడా లేకుండా స్మోకింగ్ కు వీలైనంత దూరంగా ఉండటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్మోకింగ్ తో ఆరోగ్య సమస్యలు
నిజానికి స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. పలు రకాలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు స్ట్రోక్ కలుగుతుంది. ఇది నోటి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభాన్ని చూపిస్తుంది. నోటి క్యాన్సర్, దంత క్షయం, చిగుళ్ల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాయువు క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ తో గుండెపోటు, స్ట్రోక్ సహా ఇతర గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెంచుతుంది. పొగతాగడం స్త్రీ, పురుషుల ఇద్దరిలోనూ సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. గర్భధారణ సమస్యలకు దారితీస్తుంది. ధూమపానం చర్మం ముడతలు పడటం, కంటి చూపు కోల్పోవడం లాంటి సమస్యలకు కారణం అవుతుంది.
Read Also: బటన్ మష్రూమ్స్ ఇలా రోస్ట్ చేశారంటే అదిరిపోతుంది, చపాతీ రోటీ అన్నంతో ఈ వేపుడు టేస్టీగా ఉంటుంది
స్మోకింగ్ అలవాటును ఎలా మానుకోవాలంటే?
స్మోకింగ్ ఒక ప్రమాదరకరమైన వ్యసనం. దీనిని మానేయడం అంద ఈజీ కాదు. కానీ, స్మోకింగ్ ను మానేయడం ద్వారా పలు రోగాల ముప్పును పెద్ద మొత్తంలో తగ్గించుకోవచ్చు. జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. ఒకవేళ స్మోకింగ్ అలవాటును మానేయలేకపోతే సహాయం కోసం వైద్యులను కన్సల్ట్ కావాలి. స్మోకింగ్ మానేయడానికి మందులు, ఇతర పద్దతులు అందుబాటులో ఉన్నాయి.
Read Also: కోపంతో ఊగిపోతున్నారా? రెండు నిమిషాల్లో మీ శరీరంలో ఏర్పడే ప్రమాదకర చర్యలివే!