BigTV English

Anger Management: కోపంతో ఊగిపోతున్నారా? రెండు నిమిషాల్లో మీ శరీరంలో ఏర్పడే ప్రమాదకర చర్యలివే!

Anger Management: కోపంతో ఊగిపోతున్నారా? రెండు నిమిషాల్లో మీ శరీరంలో ఏర్పడే ప్రమాదకర చర్యలివే!

Anger Side Effects: మనిషి అన్నాక సంతోషం, బాధ, కోపం వస్తూనే ఉంటాయి. సంతోషం వస్తే ఫర్వాలేదు. కానీ, కోపంతోనే అసలు సమస్య. కోప కారణాల కన్నా.. ఫలితాలు భయంకరంగా ఉంటాయని పెద్దలు చెప్తూనే ఉంటారు. కోపంతో ఎన్నో సంబంధాలు దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయి. కాసేపు కోపాన్ని ఓపిక పట్టలేని వాళ్లు ఎన్నో అవకాశాలను కోల్పోయిన సందర్భాలున్నాయి. నిజానికి ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఊరికే కోపంతో ఊగిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా అరుస్తూ సమాధానం చెప్తున్నారు. దానికి కారణం, పెరుగుతున్న విధానం. చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్లు, టీవీలకు విపరీతంగా అలవాటు చేయడం మూలంగా కోపం బాగా పెరుగుతోంది. పెద్ద వాళ్లు కూడా చిన్న విషయాలకే కోపంతో చిందులు తొక్కుతున్నారు. రెండు నిమిషాల కోపం మానవ సంబంధాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా నష్ట పరుస్తుందంటున్నారు నిపుణులు.


కోపంతో కలిగే నష్టాలు ఏంటి?  

సాధారణంగా కోపం శరీరాన్ని దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది. 2 నిమిషాల పాటు కోపంగా ఉంటే, స్ట్రెస్ హార్మోన్లు హడ్రెనలైన్, కాటిసోల్ రిలీజై.. సుమారు 4 నుంచి 5 గంటల పాటు రక్తంలో అలాగే ఉండిపోతుంది. దీని వలన హార్ట్ రేట్, ర్యాపిడ్ బ్రీతింగ్, బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతాయి. 2 నిమిషాల కోసం మన శరీరంలో ఇమ్యూనిటీని 5 నుంచి 6 గంటల పాటు వీక్ చేస్తుంది.  కోపం చర్మం మీద తీవ్రంగా పడుతుంది. స్కిన్ 6 నుంచి 8 గంటల పాటు ప్రభావితం అవుతుంది. హీలింగ్ ప్రాసెస్ ను స్లోడౌన్ చేస్తుంది. డ్రైనెస్, డల్ నెస్ ను పెంచుతుంది. ఏజింగ్ ప్రాసెస్ ను స్పీడప్ చేస్తుంది.


మానసిక ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం

కోపం మెంటల్ హెల్త్ ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. కోపం వల్ల మెడ, భుజం, దవడ ప్రాంతంలో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. చివరగా తలనొప్పి వస్తుంది. కోపంగా ఉండటం వల్ల మనుషులు లాజికల్ థింకింగ్ ను కోల్పోతారు.  ప్రతి విషయానికి తీవ్రంగా రియాక్ట్ అవుతారు. పదే పదే కోపానికి గురి కావడం వల్ల హైపర్ టెన్షన్, హార్ట్ ఎటాక్స్ తో పాటు స్ట్రోక్ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

Read Also: గుడ్డు మంచిదా, పాడైందా తెలుసుకోవాలంటే.. సింపుల్ గా ఇలా చెయ్యండి!

కోపాన్ని తగ్గించుకోవడం ఎలా?

చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడి, మీ బ్లడ్ ను బాయిల్ చేసుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు డీప్ బ్రీతింగ్, ఫిజికల్ ఎక్సర్ సైజ్ చేయడం మంచిది. కోపం తగ్గడంతో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.  అలాగే కోపం నుంచి బయటపడేందుకు ఒంటరిగా ఉండటం కంటే ఇతరులతో కలిసి మాట్లాడ్డం వల్ల మంచి చక్కటి ఫలితం కలుగుతుంది. సో, ఇకపై కోప్పడే ముందు జరిగే నష్టాలను గుర్తు చేసుకోవడం మంచిది.

Read Also:  కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×