BigTV English
Advertisement

The Raja Saab : మారుతి వెనకాల సందీప్ – నాగ్ అశ్విన్ కుట్ర… సోషల్ మీడియాలో వైరల్

The Raja Saab : మారుతి వెనకాల సందీప్ – నాగ్ అశ్విన్ కుట్ర… సోషల్ మీడియాలో వైరల్

The Raja Saab : డైరెక్టర్ మారుతి (Maruthi) వెనకాల పాన్ ఇండియా డైరెక్టర్స్ నాగ్ అశ్విన్ (Nag Ashwin), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కలిసి కుట్ర చేస్తున్నారు. మీరు విన్నది నిజమే… దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఈ ముగ్గురు దర్శకుల మధ్య ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే…


మారుతిపై నాలుగు అశ్విన్, సందీప్ రెడ్డి వంగా కుట్ర 

ప్రస్తుతం ప్రభాస్ ఖాతాలో క్రేజీ లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు హను రాఘవపూడి, యంగ్ డైరెక్టర్ మారుతి ఇప్పటికే ప్రభాస్ తో తమ సినిమాలను మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ప్రభాస్ ముందుగా ‘ది రాజా సాబ్’ మూవీని మొదలు పెట్టారు. మారుతి ఈ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా టర్న్ కాబోతున్నారు. షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రాలేదు. పైగా ప్రభాస్ మరోవైపు హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ ని శర వేగంగా పూర్తి చేస్తున్నారు.


ఇంకో వైపు ప్రభాస్ కోసం కాచుకొని కూర్చున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ తరువాత లైన్ లో ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ వీరిద్దరికీ అడ్డుగా మారాడు మారుతి. అంటే ఆయన రూపొందిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.  పైగా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతి సినిమాపై సెటైర్లు పేలుస్తున్నారు. ఈ ముగ్గురు దర్శకులపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ మొదలు పెట్టారు. అందులో తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫన్నీ వీడియో చూస్తే నవ్వాగదు.

Read Also : ‘కేసరి చాప్టర్ 2 – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ రివ్యూ

‘బాద్షా’ను ఇలా వాడేశారా ! 

‘బాద్షా’ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి, నవదీప్, బ్రహ్మానందం మధ్య జరిగే ఫన్నీ సంభాషణను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, మారుతీలకు ఆపాదిస్తూ, వీడియోను ఎడిట్ చేసి వాళ్ళ ముఖాలను యాడ్ చేశారు. అందులో “ఆ మారుతి రాజా సాబ్ రిలీజ్ గురించి చెప్పాడా?” అని సందీప్ రెడ్డి వంగా అడగ్గా, “ఏంటి చెప్పేది పోస్ట్ పోన్ చేస్తున్నాడు” అంటూ నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. దీంతో సందీప్ రెడ్డివంగా “ఏదో ఒకటి చేసి ఆ రాజా సాబ్ ను డిలీట్ చేస్తే మన మూవీని రిలీజ్ చేయొచ్చు” అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. మధ్యలో బ్రహ్మానందం ప్లేస్ లో మారుతి వచ్చేసి “నా మూవీ డిలీట్ చేస్తారా?” అంటూ బ్రహ్మానందం చెప్పే “ప్రొఫెషనల్ గా మీ కంటే పాపులర్ అవుతున్నానని జెలుసీతో ఇంతకు తెగించారురా” అనే డైలాగ్ ని పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో సేద తీరుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×