మష్రూమ్స్ తో చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. మష్రూమ్స్ కర్రీ, మష్రూమ్ మసాలా కర్రీ, మష్రూమ్ బిర్యాని లాగే మష్రూమ్ రోస్ట్ చేసి చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. మష్రూమ్ రోస్ట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. చికెన్, మటన్ కూడా దీని ముందు తేలిపోతాయి. మష్రూమ్ రోస్ట్ ను వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. చపాతీ, రోటీ, పూరితో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ చేసుకోవడానికి బటన్ మష్రూమ్లో ఎంపిక చేసుకోండి. ఇవి అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. పైగా రుచిగా కూడా ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు కూడా ఎక్కువ బటన్ మష్రూమ్స్ తో రోస్ట్ ఎలా చేయాలో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
బటన్ మష్రూమ్స్ – పావు కిలో
నిమ్మరసం – ఒక స్పూను
కరివేపాకు పొడి – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
నూనె – రెండు స్పూన్లు
పసుపు – పావు స్పూను
పచ్చిమిర్చి – రెండు
మిరియాల పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయలు – రెండు
బటన్ మష్రూమ్స్ రోస్ట్ రెసిపీ
⦿ బటన్ మష్రూమ్స్ ను మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి.
⦿ ఒక్కో బటన్ మష్రూమ్ మూడు ముక్కలు చేసుకుంటే మంచిది.
⦿ ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేసి బాగా కలపండి.
⦿ ఈ మష్రూమ్స్ ను అందులో వేసి అరగంట పాటు నానబెట్టండి.
⦿ ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
⦿ ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా కలపండి.
⦿ అలాగే పచ్చిమిర్చి తరుగును వేయండి. ఇవి రంగు మారే వరకు వేయించండి.
⦿ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా కలపండి.
⦿ ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మష్రూమ్స్ ను తీసి చేత్తోనే పిండి ఇందులో వేసి బాగా కలపండి.
⦿ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మష్రూమ్స్ ను ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి.
⦿ ఆ తర్వాత మూత తీసి కరివేపాకు పొడి, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి.
⦿ చిన్న మంట మీద దీన్ని రోస్ట్ చేసుకోవాలి. నీరు ఇంకిపోయి ఇది మంచిగా ఫ్రై లాగా అవుతుంది.
⦿ అప్పుడు పైన నిమ్మరసం చేసుకుని ఒకసారి కలుపుకోండి.
⦿ అంతే టేస్టీ మష్రూమ్ రోస్ట్ రెడీ అయినట్టే. ఇది అన్నంతో తిన్నా, రోటితో నంచుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది.
పుట్టగొడుగుల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పోషకాలను సమతులంగా ఉంచుతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు. పుట్టగొడుగులను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే పుట్టగొడుగులను ఎవరైతే తరచూ తింటారో వారికి క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే డయాబెటిస్ కూడా వచ్చే ఛాన్స్ అదుపులో ఉంటుంది. కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా పుట్టగొడుగులు ఎంతో ఉపయోగపడతాయి. వారానికి రెండు సార్లు పుట్టగొడుగులు తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి పోషకాహార లోపం రాదు.
Also Read: కర్బూజ పండుతో మస్త్ బెనిఫిట్స్.. తింటే మాములుగా ఉండదు..
పుట్టగొడుగుల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నవారు అప్పుడప్పుడు పుట్టగొడుగులను తినాల్సిన అవసరం ఉంది. పిల్లలకు కూడా వీటిని తినిపించవచ్చు. మష్రూమ్స్ ను తరచూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా వైరస్ లతో పోరాడే శక్తి మీకు అందుతుంది. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెకు ఎంతో మేలు చేస్తాయి. మష్రూమ్స్ లో పొటాషియం, సెలీనియం, కాపర్, నియాసిన్ వంటివి అధిక పోషకాలు ఉంటాయి. అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ.