E-Paper
Advertisement

వాస్కులర్ డిసీజ్ అంత ప్రమాదకరమా? కాళ్ల నొప్పులు, మధుమేహంతో దీనికి ఉన్న లింక్ ఏంటి?

వాస్కులర్ డిసీజ్ అంత ప్రమాదకరమా? కాళ్ల నొప్పులు, మధుమేహంతో దీనికి ఉన్న లింక్ ఏంటి?
Advertisement

Vascular Disease Symptoms: ప్రస్తుతం మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం గుండె జబ్బులకే కాదు, శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీసే ‘వాస్కులర్’ వ్యాధులకు కూడా ప్రధాన కారణమవుతున్నాయని పుణేలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సంతోష్ పాటిల్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగిందని, ముఖ్యంగా 40 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మధ్య వయస్కులు దీని బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వాస్కులర్ వ్యాధి అంటే?

మన శరీరంలో రక్త ప్రసరణను సాగించే ధమనులు, సిరలు దెబ్బతినడాన్ని లేదా వాటిలో బ్లాక్స్ (అడ్డంకులు) ఏర్పడటాన్ని వాస్కులర్ వ్యాధి అంటారు. రక్తం సరిగ్గా ప్రవహించనప్పుడు గుండెపోటు, పక్షవాతం మాత్రమే కాకుండా కాళ్లు, కిడ్నీలు, మెదడు, కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల ముఖ్యమైన అవయవాలకు అందాల్సిన రక్తం, ఆక్సిజన్ అందక శరీర భాగాలు దెబ్బతింటాయి.

Advertisement

Also Read: ఆఫీస్ మెయిళ్లు, నోటిఫికేషన్ల టార్చర్.. 25 ఏళ్లకే బర్నౌట్ అవుతున్న Gen Z, బయటపడే మార్గమే లేదా?

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు:

చాలామంది కాళ్ల నొప్పులను వయసుతో వచ్చే సాధారణ నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం, కాళ్ల వాపులు, తిమ్మిరి, ఎప్పుడూ అలసటగా అనిపించడం, కాళ్లపై వచ్చే గాయాలు త్వరగా మానకపోవడం, కళ్లు తిరగడం, అకస్మాత్తుగా చూపు మసకబారడం వంటివి వాస్కులర్ వ్యాధికి ముఖ్యమైన సంకేతాలు. ఈ లక్షణాలను ముందే గుర్తించకపోతే, భవిష్యత్తులో కాళ్లు తీసివేయాల్సిన పరిస్థితి లేదా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.

మారిన జీవనశైలే కారణం:

Advertisement

నేటి ఆధునిక జీవనశైలి, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలు క్రమంగా పాడైపోతున్నాయి. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సమస్యలు రక్తనాళాల లోపలి పొరలను నిరంతరం దెబ్బతీస్తూనే ఉంటాయి.

నివారణ మార్గాలు ఇవే:

మంచి విషయమేమిటంటే.. సరైన సమయంలో జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లతో కూడిన మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. షుగర్, బీపీ ఉన్నవారు వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, క్రమం తప్పకుండా డాక్టర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడవచ్చు.

Also Read: ఈ వానలకు వేడి వేడి డీప్ ఫ్రై స్నాక్స్ తినాలనిపిస్తుందా? అయితే ఈ Air Fryers మీ కిచెన్‌లో ఉండాల్సిందే!

Related News

సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారు? కెమెరా వెనుక జరిగేది ఇదే

ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి

మోసం చేసిన వారిని ఎప్పటికీ క్షమించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు తప్పు చేస్తే రెండో ఛాన్స్ ఇవ్వరు

చాటింగ్‌లో మనసును తాకే మాటలు, కవిత్వాలు.. నిజజీవితంలో మాత్రం బోర్.. ఎందుకలా?

జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండాలా? ఈ సింపుల్ వాకింగ్ టెక్నిక్స్ చేస్తే సరి

మూత్రంలో రక్తం రావడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. గుండెలో సూది చూసి షాకైన డాక్టర్లు..

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు

Big Stories

Advertisement
×