Friendship Day gift ideas: ఫ్రెండ్షిప్ డే రాగానే.. మనకు వచ్చే మొదటి టెన్షన్..నా బెస్ట్ ఫ్రెండ్‌కి ఈ సారి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ? అనేది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే కాస్ట్లీ గిఫ్ట్స్ అందరి బడ్జెట్‌కు సరి పడకపోవచ్చు. కానీ.. ఖరీదైన బహుమతుల కంటే మన మనసు నుంచి వచ్చే చిన్న బహుమతే స్నేహాన్ని మరింత స్ట్రాండ్‌గా మారుస్తుంది. తక్కువ ఖర్చుతో.. మీ బెస్ట్ ఫ్రెండ్ కంట్లో.. ఆనందం చూసేలా చేసే కొన్ని అదిరిపోయే, ట్రెండీ గిఫ్ట్ ఐడియాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్నేహితులకు గిఫ్ట్ ఇవ్వడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన ప్రేమ, ఇష్టాలు ప్రతిబింబించేలా ఉంటే చాలు. అంతే కాకుండా నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఐడియాలు మీ కోసం
మీ ఇద్దరి బెస్ట్ మెమరీస్ ఉన్న ఫోటోలతో ఉండే వుడెన్ ఫ్రేమ్స్ లేదా రాత్రి పూట వెలిగే ఎల్ఈడీ యాక్రిలిక్ లాంప్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి మీ రూంలో.. పెట్టుకోవడానికి చాలా అందంగా ఉండటమే కాకుండా.. పాత జ్ఞాపకాలను రోజూ గుర్తు చేస్తూ ఉంటాయి. ఇవి రూ.300 నుంచి రూ.600 లోపు ఈజీగా లభిస్తాయి.
2. హ్యాండ్‌మేడ్ మెమరీ జార్ :
డబ్బులతో కొనలేని అందమైన బహుమతి ఏదైనా ఉందంటే.. అది మీ చేతులతో చేసేదే. ఒక గాజు జార్ తీసుకుని, అందులో మీరు మీ ఫ్రెండ్‌తో గడిపిన మధురమైన క్షణాలు, చిన్న జోకులు, వాళ్లకు మీరు చెప్పాలనుకునే.. మంచి మాటలను చిన్న చిట్టీలుగా రాసి వేయండి. ప్రతి రోజూ ఒక చిట్టీ చొప్పున తీసి చదువుకోవడానికి ఇది చాలా ఎమోషనల్ అండ్ క్యూట్ గిఫ్ట్ అవుతుంది.
“ఇన్ఫినిటీ” లేదా “బెస్ట్ ఫ్రెండ్స్” సింబల్స్ ఉన్న మ్యాచింగ్ బ్రాస్‌లెట్స్ (లేదా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్) ఇద్దరూ పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. అలాగే బైక్ లేదా రూమ్ కీస్ కోసం మీ ఇద్దరి పేర్లు లేదా ఇనిషియల్స్ ఉన్న కస్టమైజ్డ్ కీ-చెయిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి చాలా తక్కువ బడ్జెట్‌లో వస్తాయి.
మీ స్నేహాన్ని ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంచడానికి ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ (ఉదాహరణకు: జాడే ప్లాంట్ లేదా లక్కీ బాంబూ) గిఫ్ట్ ఇవ్వండి. ఇది చూడటానికి చాలా మోడ్రన్‌గా ఉండటమే కాకుండా..పర్యావరణానికి కూడా చాలా మంచిది.”మన స్నేహం లాగే ఈ మొక్క కూడా ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి” అని చెప్పి ఇవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: ఫ్రెండ్‌షిప్ డే వెనక ఉన్న.. అసలు కథ ఇదీ!
మార్కెట్లో దొరికే రెడీమేడ్ చాక్లెట్ బాక్స్‌లకు బదులుగా..మీ ఫ్రెండ్‌కు ఇష్టమైన చాక్లెట్స్ అన్నీ కలిపి ఒక అందమైన బాక్స్‌లో పెట్టి, దాంతో పాటు మీ చేతితో రాసిన ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ ఇవ్వండి. ఎంత పెద్ద వారైనా చాక్లెట్స్ చూసి సంతోష పడకుండా ఉండలేరు! డిజిటల్ యుగంలో చేతితో రాసిన లెటర్‌కి ఉండే విలువ ఎప్పటికీ ప్రత్యేకమే.
గిఫ్ట్ ఎంత ఖరీదైనది అనేది ముఖ్యం కాదు, దాని వెనక ఉన్న ప్రేమ, కేటాయించిన సమయం చాలా ముఖ్యం. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఈ ట్రెండీ ఐడియాలతో మీ బెస్ట్ ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చి వారి ముఖంలో చిరునవ్వు చూడండి. అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!