E-Paper
Advertisement

జీవితంలో నిజమైన స్నేహితుడు ఎంత ముఖ్యం? ఫ్రెండ్షిప్ డే స్పెషల్

జీవితంలో నిజమైన స్నేహితుడు ఎంత ముఖ్యం? ఫ్రెండ్షిప్ డే స్పెషల్
Advertisement

Friendship Day importance: మొబైల్ స్క్రీన్‌లకే పరిమితమైన నేటి ఉరుకులు పరుగుల జీవితంలో, ఒక నిజమైన మిత్రుడు పక్కన ఉండటం అనేది ఎంతో పెద్ద అదృష్టం. లైఫ్ ఎంత బిజీగా ఉన్నా, “ఒరేయ్ నేనున్నాను రా” అనే ఒక్క మాట చాలు మన ఒంటరితనం కరిగిపోవడానికి. ఇదిలా ఉంటే.. ప్రతి ఏటా ఆగస్ట్ మొదటి వారంలో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు.అసలు ఆగస్టు మొదటి ఆదివారం లోనే మనం ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకోవాలి? దీని వెనక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ ఏంటి? మన లైఫ్‌లో ఫ్రెండ్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్నేహం:

ఉద్యోగాలు, కెరీర్, టార్గెట్లు అంటూ నిత్యం పరిగెత్తే నేటి జనరేషన్‌కు సోషల్ మీడియా ఫ్రెండ్స్ వేలల్లో ఉండవచ్చు. కానీ.. అర్థరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి మాట్లాడినా అవతలి వైపు నుంచి రిసీవ్ చేసుకునే ఒక్క బెస్ట్ ఫ్రెండ్.. ఉండటం గ్రేటెస్ట్ లక్. మనసు విప్పి మాట్లాడటానికి, ఎలాంటి మొహమాటం లేకుండా.. పిచ్చి వేషాలు వేయడానికి కేవలం స్నేహితులు మాత్రమే అర్హులు. అందుకే పెద్దలు “బ్లడ్ రిలేషన్స్ దేవుడు ఇస్తాడు. బెస్ట్ ఫ్రెండ్స్‌ను మనమే ఎన్నుకుంటాం” అంటారు.

Advertisement

ఫ్రెండ్షిప్ డే చరిత్ర:

ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం వెనక పెద్ద చరిత్రే ఉంది. 1958లో పరాగ్వే దేశంలో.. ఆర్టెమియో బ్రాకో అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక డిన్నర్ పార్టీలో ఈ ఆలోచనను తెరపైకి తెచ్చారు. జులై 30న మొట్ట మొదటిసారిగా ‘వరల్డ్ ఫ్రెండ్షిప్ డే’వేడుకలు జరపాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత 2011లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా జులై 30 ని ‘అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది.

Advertisement

అయితే మన దేశంతో.. పాటు కొన్ని దేశాల్లో.. మాత్రం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీ వారు 1930లలో.. మార్కెటింగ్ కోసం దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చినా.. కాల క్రమేణా ఇది యువత గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

కాలంతో పాటు స్నేహం రూపం కూడా మారింది. ఒకప్పుడు చేతికి రంగు రంగల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడం ట్రెండ్ అయితే.. ఇప్పుడు రీల్స్ షేర్ చేయడం, మీమ్స్ ట్యాగ్ చేయడం, అర్ధరాత్రి కేక్ కటింగ్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. టెక్నాలజీ ఎంత మారినా.. వాట్సాప్ చాట్లు ఎన్ని ఉన్నా.. కష్టంలో ఉన్నప్పుడు ఒక భుజం తట్టి ధైర్యం చెప్పే స్నేహితుడి విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు.

జీవితంలో నిజమైన స్నేహితుడు ఎంత ముఖ్యం?
మానసిక ఒత్తిడి దూరం: ఎంత పెద్ద డిప్రెషన్ లేదా టెన్షన్ ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్‌తో అరగంట మాట్లాడితే సగం సమస్యలు చిటికెలో మాయమవుతాయి.

జడ్జిమెంట్ ఫ్రీ జోన్: ఇంట్లో అమ్మనాన్నల దగ్గర, ఆఫీస్‌లో బాస్ దగ్గర భయపడాలి కానీ.. ఫ్రెండ్స్ దగ్గర ఏ టెన్షన్ లేకుండా మనలా మనం ఉండొచ్చు. మనల్ని ఏ మాత్రం జడ్జ్ చేయని ఏకైక ప్రదేశం ఫ్రెండ్స్ గుండెల్లోనే దొరుకుతుంది.

పర్సనాలిటీ గ్రోత్: మంచి స్నేహితులు మనలోని తప్పులను ముఖం మీద మొట్టికాయ వేసి మరీ సరిదిద్దుతారు. కెరీర్‌లో పైకి రావడానికి మోటివేట్ చేస్తారు.

స్నేహం అనేది ఒక గమ్యస్థానం కాదు..జీవితాంతం సాగే ఒక అందమైన ప్రయాణం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ బిజీ లైఫ్ నుంచి కొంచెం టైమ్ కేటాయించి, మీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ఆ బెస్ట్ ఫ్రెండ్‌కు చిన్న థాంక్స్ చెప్పండి. ఎందుకంటే డబ్బుతో.. కొనలేని అత్యంత విలువైన ఆస్తి నిజమైన స్నేహితుడే! హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అడ్వాన్స్!

Related News

ఆగస్టు మొదటి ఆదివారమే ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటారు? ఆసక్తికరమైన నిజాలు

ఫ్రెండ్ షిప్ డే రోజు మీ ఫ్రెండ్‌కి ఇవి గిఫ్ట్ ఇవ్వండి,వాళ్లు ఫిదా అవడం గ్యారంటీ!

ఆర్భాటాలు లేకుండా ఉండలేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ‘షో ఆఫ్’ చేస్తుంటారు

చాణక్య నీతి.. ఈ 5 తప్పుల వల్లే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు

వ్యాయామంతోనే ప్రీడయాబెటిస్‌ తగ్గించవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

స్నేహితులు, బంధువులు మళ్లీ మళ్లీ అప్పు అడుగుతున్నారా? మీ రిలేషన్ దెబ్బతినకుండా ‘కుదరదు’ అని ఇలా చెప్పండి

జెన్ జీ బ్యాచ్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. వాళ్ల లెక్కే వేరు!

Big Stories

Advertisement
×