Thai Crime Thriller: నిజాయితీ గల పోలీస్ అధికారిని ఒక్కసారిగా దొంగగా ముద్ర వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? తాను చేయని నేరానికి శిక్ష పడే పరిస్థితి వస్తే… తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అతను ఎంత దూరం వెళ్తాడా ? ఇలాంటి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన థాయ్ యాక్షన్, కామెడీ వెబ్ సిరీస్ Man of Virtue. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌కు కామెడీని జోడిస్తూ రూపొందించిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ కొత్త మలుపులతో సాగుతుంది. ఒకవైపు ఉత్కంఠభరితమైన దర్యాప్తు, మరోవైపు సన్యాసి అవతారంలో హీరో చేసే హంగామా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
నిజాయితీకి మారుపేరుగా పేరు తెచ్చుకున్న ఓ పోలీస్ అధికారి జీవితంలో ఒక్కసారిగా ఊహించని ఘటన జరుగుతుంది. కోట్ల రూపాయల విలువైన వజ్రం దొంగతనం కేసులో అతనిపైనే ఆరోపణలు వస్తాయి. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఆధారాలన్నీ అతనికే వ్యతిరేకంగా ఉండటంతో… పోలీస్ శాఖ అతన్ని సస్పెండ్ చేస్తుంది. ఒక్కసారిగా ఉద్యోగం, గౌరవం, నమ్మకం అన్నీ కోల్పోయిన అతను అసలు నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటాడు.
అయితే అతని కోసం పోలీసులు మాత్రమే కాదు… అసలైన వజ్రం దొంగలు కూడా వెతుకుతుంటారు. దీంతో అందరి కళ్లను మోసం చేయడానికి అతను ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. సన్యాసి అవతారమెత్తి ఒక ఆశ్రమంలో చేరిపోతాడు. బయటకు ప్రశాంతంగా కనిపించే ఆ ఆశ్రమం నుంచే తన రహస్య దర్యాప్తు మొదలు పెడతాడు. అక్కడ జరిగే సంఘటనలు ఒకవైపు నవ్వులు పంచుతుంటే, మరోవైపు అసలు నేరస్తుల దగ్గరకు అతన్ని తీసుకెళ్తాయి.
దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ వజ్రం దొంగతనం వెనుక ఉన్న మాఫియా నెట్‌వర్క్ బయట పడుతుంది. ఆ వజ్రం కోసం జరిగే ప్రాణాంతకమైన ఆటలో హీరో కూడా చిక్కుకుంటాడు. ఈ కేసులో తనను ఇరికించిన అసలు వ్యక్తి ఎవరు ? వజ్రం ఎక్కడికి వెళ్లింది ? సన్యాసి వేషంలో అతను నిజాన్ని ఎలా బయట పెట్టాడు ? మాఫియా గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నాడు ? అనే అంశాల గురించి తెలియాలంటే సినిమాను చూసి తీరాల్సిందే.
ప్రస్తుతం ‘మ్యాన్ ఆఫ్ విర్చ్యు’ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. థాయ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సన్నివేశాలు, కామెడీ టైమింగ్, సస్పెన్స్‌తో కూడిన స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. సీరియస్ కథను వినోదాత్మకంగా మేకర్స్ చెప్పిన విధానం ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మారుస్తుంది. ముఖ్యంగా ఆశ్రమంలో హీరో చేసే రహస్య ఆపరేషన్లు నవ్వులతో పాటు థ్రిల్‌ను కూడా అందిస్తాయి. యాక్షన్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ మూడు ఈ ఒక్క సిరీస్‌లోనే ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు, ఉత్కంఠ, వినోదం సమపాళ్లలో ఉండటం దీని ప్రత్యేకత. ఈ వీకెండ్‌లో లైట్ కామెడీతో పాటు సస్పెన్స్ కూడా ఆస్వాదించాలని ఈ థాయ్ సిరీస్‌ను డోంట్ మిస్. కానీ ఈ సిరీస్ తెలుగు వెర్షన్ ఇంకా రాలేదు.
Read Also: తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో