E-Paper
Advertisement

వ్యాయామంతోనే ప్రీడయాబెటిస్‌ తగ్గించవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వ్యాయామంతోనే ప్రీడయాబెటిస్‌ తగ్గించవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

Prediabetes Reversal Exercise | ప్రీడయాబెటిస్ అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. అయితే అవి ఇంకా టైప్ 2 మధుమేహంగా గుర్తించే స్థాయికి చేరలేదు కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే డయాబెటీస్ తప్పకుండా రాబోతోందని అర్థం. ఈ పరిస్థితిలో శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించకపోవడం వల్ల వస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ప్రీడయాబెటిస్‌ ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండో క్రైనాలజీ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఇండియాలో 15.3 శాతం పెద్దలు ప్రీడయాబెటీస్ స్థితిలో ఉన్నారు. అంటే వీరంతా త్వరలోనే మధుమేహం బాధితులు కాబోతున్నారు.

వ్యాయామం చేస్తే ప్రీడయాబెటిస్‌ తగ్గిపోతుందా?

అపోలో హాస్పిటల్స్‌కు చెందిన షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ ప్రసాద్ ప్రకారం.. ప్రారంభ దశలో ప్రీడయాబెటిస్‌ను గుర్తిస్తే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా చాలామందిలో ఈ పరిస్థితిని నియంత్రించడం లేదా తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యమవుతుంది. అయితే మంచి ఫలితాల కోసం వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి కూడా అవసరం.

వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది?

Advertisement

వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కండరాలు గ్లూకోజ్‌ను సులభంగా ఉపయోగించుకుంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే శరీరం ఇన్సులిన్‌కు మెరుగ్గా స్పందిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మెరుగుపడతాయి.

ఏ వ్యాయామాలు చేయాలి?

రోజూ వేగంగా నడవడం చాలా సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం. అలాగే సైక్లింగ్, జాగింగ్, ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు కూడా రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. స్క్వాట్స్, లంజెస్, రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు లేదా తేలికపాటి వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. నడకతో పాటు స్వల్పంగా వెయిట్ లిఫ్టింగ్ వర్కెట్స్ కలిపి చేయడం మరింత మంచి ఫలితాలు ఇస్తుంది.

వారానికి ఎంత వ్యాయామం అవసరం?

Advertisement

ఆరోగ్య నిపుణులు వారానికి కనీసం 150 నిమిషాల మీడియం తీవ్రత కలిగిన వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఇంకా మంచి ఫలితాల కోసం వారానికి 300 నిమిషాల వరకు వ్యాయామం చేయవచ్చు. అదనంగా వారంలో కనీసం రెండు రోజులు వెయిట్ లిఫ్లింగ్ వర్కౌట్స్ చేయడం మంచిది. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం, వీకెండ్స్‌లో మాత్రమే ఎక్కువసేపు చేయడంకంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

వ్యాయామం ఒక్కటే సరిపోతుందా?

వ్యాయామం ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా పనిచేయదు. అధిక బరువు, కుటుంబంలో మధుమేహ చరిత్ర, ఇతర ఆరోగ్య సమస్యలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, బరువును క్రమంగా తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. వైద్యుల పర్యవేక్షణలో రక్తంలో షుగర్ లెవెల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి.

ప్రీడయాబెటిస్ తగ్గుతున్న సంకేతాలు

ఉదయం ఖాళీ కడుపుతో చేసే రక్తంలో చక్కెర పరీక్షలో మంచి ఫలితాలు కనిపించడం ఒక ముఖ్యమైన సంకేతం. అలాగే HbA1c స్థాయిలు తగ్గడం, నడుము చుట్టుకొలత తగ్గడం, బరువు తగ్గడం, శక్తి పెరగడం వంటి మార్పులు కూడా ఆరోగ్యం మెరుగుపడుతున్నాయని సూచిస్తాయి.

Also Read: డైట్ సోడా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుదల, త్వరగా వృద్ధాప్యం.. నిజమేనా?

ప్రీడయాబెటిస్‌ త్వరగా నియంత్రించేందుకు చిట్కాలు

ప్రతిసారీ భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నడవడం మంచిది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా ఉండాలి. వారానికి రెండు రోజులు వెయిట్ లిఫ్టింట్ వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. బరువును నెమ్మదిగా, ఆరోగ్యకరంగా తగ్గించుకోవాలి.

ప్రీడయాబెటిస్‌ ప్రారంభ దశలో గుర్తిస్తే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా చాలామందిలో మంచి మార్పులు కనిపిస్తాయి. అయితే వ్యాయామంతో పాటు సమతుల ఆహారం, సరైన జీవనశైలి పాటిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వైద్యుల సలహాతో ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

గమనిక: ఈ వ్యాసంలో తెలిపిన సమాచారం నిపుణులు సూచనల మేరకు మీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే సరైన వైద్య నిపుణులను సంప్రదించండి.

Also Read: దోమలను చంపేందుకు కొత్త దోమలు.. 6 లక్షల స్పెషల్ దోమలు విడుదల

Related News

చాణక్య నీతి.. ఈ 5 తప్పుల వల్లే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు

స్నేహితులు, బంధువులు మళ్లీ మళ్లీ అప్పు అడుగుతున్నారా? మీ రిలేషన్ దెబ్బతినకుండా కుదరదు అని ఇలా చెప్పండి

జెన్ జీ బ్యాచ్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. వాళ్ల లెక్కే వేరు!

స్నేహితులు దూరంగా ఉన్నారా? ఫ్రెండ్ షిప్ డే సెలెబ్రేట్ చేసుకునేందుకు క్రియేటివ్ ఐడియాలు ఇవిగో

వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

Big Stories

Advertisement
×