BigTV English

Husband Salary: నేను తక్కువ సంపాదిస్తున్నానని నా భార్య చులకనగా మాట్లాడుతోంది, ఆమెను మార్చడం ఎలా?

Husband Salary: నేను తక్కువ సంపాదిస్తున్నానని నా భార్య చులకనగా మాట్లాడుతోంది, ఆమెను మార్చడం ఎలా?

ప్రతి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. కేవలం మహిళలకే కాదు పురుషులు కూడా ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి తన బాధను ఇలా చెప్పుకున్నాడు. దానికి మానసిక నిపుణులు సలహాను కూడా అందించారు.


ప్రశ్న: నాది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు నేను ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో ఉండేవాన్ని. కాకపోతే అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న ఇప్పటి నా భార్య తనతో సమయం గడపడం లేదని అడిగింది. ఆమె తక్కువ జీతం వచ్చినా ఫరవాలేదు… ఎక్కువ సమయం తనతో గడిపేలా చిన్న ఉద్యోగం వెతుక్కోమని చెప్పింది. ఆమె కోసం నేను ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి చిన్న ఉద్యోగంలో చేరాను. మూడేళ్ల పాటు మేము డేటింగ్ చేశాక పెళ్లి చేసుకున్నాను. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. పెళ్ళికి ముందు ఆమెకు సమస్యగా కనిపించని నా జీతం.. ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. నేను తక్కువ సంపాదిస్తున్నానని నన్ను చాలా అగౌరవంగా చూస్తోంది. బంధువులు ముందు కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతోంది.

నువ్వు తెచ్చే జీతం ఖర్చులకే సరిపోదు.. ఇంకా ఎలా బతుకుతామో.. అంటూ మాట్లాడుతోంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా గురించి చాలా చులకన చేసి చెబుతోంది. నిజానికి ఆమె వల్లే నేను మంచి జీవితాన్ని వదిలి తక్కువ జీతంలోకి వచ్చాను. ఇప్పుడు ఆమెకు నేను నచ్చడం లేదు. నేను సంపాదించే డబ్బులు పైనే ధ్యాసంతా ఉంది. ఆమె నాకన్నా ఎక్కువ సంపాదించడం వల్ల ఆ విషయాన్ని కూడా పదే పదే ఎత్తిచూపుతోంది. భార్య సంపాదనపై పడి బతుకుతున్నావు అంటూ వెక్కిరిస్తోంది. ఇలా అనడం వల్ల నా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆమెను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఈ కారణంగా వదిలేయాలనిపించడం లేదు. అలా అని ఆమెను భరించడం కూడా కష్టంగానే ఉంది. ఏం చేయమంటారు?


జవాబు: మీరు సంపాదించే జీతం మీ ఇంట్లో మీ ఇద్దరి ఖర్చులకు సరిపోవడంలేదని మీ భార్య మిమ్మల్ని తక్కువగా చూస్తోంది. ఆమె గతాన్ని మర్చిపోయింది. ఆ గతాన్ని ఆమెకు అందంగా గుర్తు చేయండి. మూడేళ్ల డేటింగ్ లో తక్కువ జీతం అయినా కూడా మీరు ఎంత ఆనందంగా జీవించారో చెప్పండి. తనకు సహకారం అందిస్తే తప్పకుండా ఎక్కువ జీతం ఉండే ఉద్యోగానికి వెళతానని, అంతవరకు సమయం కావాలని కోరండి. భర్త, భార్య ఇంట్లో సమానమే. భర్తకు కష్టం వచ్చినప్పుడు భార్య ఆదుకోవడం, భార్యకు కష్టం వచ్చినప్పుడు భర్త ఆదుకోవడం అనేది పెళ్లిలో చేసుకున్న ప్రమాణాల్లో ముఖ్యమైనది. అది ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. మనిషి ముఖ్యమో, జీతం ముఖ్యమో ఆమెను కూర్చోబెట్టి అడగండి. ఇలాంటి విషయాలు గొడవలు పడితే పెద్దవవుతాయి. అదే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే చాలా వరకు సమస్య పోతాయి.

మీ భార్య మిమ్మల్ని తిట్టిందని మీరు మానసిక ఆవేదనకు గురి కావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీ జీతం తక్కువ అనే అంశం ఆమెలో ఎందుకంత మానసిక వేదనకు గురిచేస్తుందో మాట్లాడండి. మీరు ఆమె కోసమే కష్టపడుతున్నారని చెప్పండి. అలాగే అవకాశాలు వెతుకుతున్నట్టు తప్పకుండా మంచి జీతం వచ్చే ఉద్యోగానికి భవిష్యత్తులో వెళ్తానని ఆమెకు నమ్మకం కలిగించండి. అంతేకాదు మీ ఇద్దరినీ విడివిడిగా చూసుకోకండి. మీ ఇద్దరూ ఒకటే అన్న విషయం ఆమెకు అర్థం అయ్యేలా  చెప్పండి. అలాగే మీ ఇద్దరూ జీతాలు కలిపితే మీరు బతకడానికి సరిపోతుందో లేదో చూడండి.

కచ్చితంగా ఆమె మిమ్మల్ని వెక్కిరిస్తోందంటే ఆమె జీతం మీ కన్నా ఎక్కువ అని అర్థమవుతుంది. మీ ఇద్దరి జీతాలు కలిస్తే సంతోషంగా మీరు జీవించడానికి సరిపడా ఉంటుంది. కాబట్టి జీవితాన్ని అందంగా బతకడం ఇద్దరూ నేర్చుకోండి. మీ సమస్యను ఓపికగా కమ్యూనికేట్ చేయండి. ఆమె తిట్టిందని కోపంలో మీరు ఇతర నిర్ణయాలు తీసుకుంటే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అలా కాకుండా కాస్త ఓపిక పట్టి ఆమెకు కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పండి. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా అందుకుంటారని వివరించండి. అలాగే నువ్వే నా పరిస్థితుల్లో ఉంటే… నేను నిన్ను ఒక్క మాట అనే వాడిని కాదని చెప్పండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఇప్పుడు ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళు పరిస్థితులు బాగోక తక్కువ జీతానికి వెళ్ళవచ్చు, తక్కువ జీతంలో ఉన్నవాళ్లు ఎక్కువ జీతం అందుకోవచ్చు. కాలం కలిసి వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుందని వివరించండి. అందుకోసం ఆమె తల్లిదండ్రుల సాయాన్ని కూడా తీసుకోండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×