BigTV English

Rice Storage: బియ్యంలో పురుగులు పడుతున్నాయా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Rice Storage: బియ్యంలో పురుగులు పడుతున్నాయా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Rice Storage: బియ్యం నిత్యవసర సరుకుల్లో ముఖ్యమైనవి.దాదాపు చాలా మంది ఇళ్లలో నెలకు సరిపడా బియ్యం నిల్వలు ఉంటాయి. ఒకే సారి బియ్యం కొనుక్కురావడం వల్ల మళ్లీ మళ్లీ తీసుకురావాలనే ఇబ్బంది ఉండదు. కానీ వీటిని పురుగులు పట్టకుండా నిల్వ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బియ్యంతో పాటు , పప్పులు మరికొన్నింటిని నిల్వ చేయడంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా పాడై పోతాయి. తేమ లేదా ఇతర కారణాల వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది. మరి బియ్యంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచాలి. వీటికి సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బియ్యం లేదా పప్పులకు పెరుగులు ఎందుకు పడతాయి ?

తేమ- అధిక తేమ కారణంగా పురుగులు బియ్యం లేదా పప్పులలో పెరుగుతాయి.
ధూళి- బియ్యం నిల్వ చేసే పాత్ర శుభ్రంగా లేకుంటే కూడా అందులో పురుగులు చేరుతాయి.
పాత గింజలు- ఎక్కు కాలం నిల్వ ఉన్న గింజల్లో పురుగులు వచ్చే అవకాశం ఎక్కువ.


పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

ఎండలో ఆరబెట్టండి:
బియ్యం లేదా పప్పులను శుభ్రమైన కాటన్ గుడ్డపై వేసి ఎండలో ఆరబెట్టండి. సూర్యుని వేడి వల్ల పురుగులు చనిపోతాయి. రెండు, మూడు రోజులు ఇలా చేయడం వల్ల దాదాపు బియ్యం లేదా పప్పుల్లో ఉన్న పురుగులు చనిపోతాయి. ఎండలో బియ్యం లేదా పప్పులు ఆరబెట్టే ముందు సమానంగా పోసి ఆరబెట్టండి.

వెల్లుల్లి ఉపయోగించండి:
కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఒలిచి బియ్యం లేదా పప్పుతో ఉంచండి. వెల్లుల్లి యొక్క ఘాటైన వాసనకు పురుగులు ఉండవు. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బిర్యాని ఆకులు:
బియ్యం లేదా పప్పులో కొన్ని బిర్యాని ఆకులను వేసి ఉంచండి. బిర్యాణి ఆకుల ఘాటైన వాసనను పురుగులు తట్టుకోలేవు. ఈ రెమెడీ పాటించడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. వారానికి ఒకసారి ఈ రెమెడీని రిపీట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఉప్పు:

బియ్యం లేదా పప్పుతో కొంచెం ఉప్పు కలపండి. ఉప్పు పురుగులకు హానికరం.బియ్యం లేదా పప్పుల్లో ఉప్పు కలపడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

మిరపకాయ:
కొన్ని ఎండు మిరపకాయలను గ్రైండ్ చేసి బియ్యం లేదా పప్పులో కలపండి. మిరపకాయ యొక్క ఘాటైన వాసనకు పురుగులు రాకుండా ఉంటాయి. తరుచుగా ఇలా చేయడం వల్ల కూడా పురుగులు పట్టకుండా ఉంటాయి.

Also Read: అవిసె గింజలతో.. కొలెస్ట్రాల్ కంట్రోల్

మరికొన్ని జాగ్రత్తలు:

బియ్యం, పప్పులకు చల్లని, పొడి ప్రదేశంలో ఉంచండి.

ధాన్యాలను ఎల్లప్పుడూ గాలి చేరని కంటైనర్‌లో నిల్వ చేయండి.

ధాన్యాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ చేయండి.

పురుగులు కనిపిస్తే, వెంటనే వాటిని తొలగించండి.

ధాన్యం కొనేటప్పుడే వాటి నాణ్యతను చెక్ చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×