Hair Fall: చలికాలంలో చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. చుండ్రు వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. అంతే కాకుండా చుండ్రు కారణంగా తలలో దురద వస్తుంది. ఇది చాలా అసహ్యంగా కనిపించడంతో పాటు భుజాలపై కూడా పడుతుంది. చుండ్రును వదిలించుకోవడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ తప్పకుండా వాడాలి. వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చలికాలంలో చర్మం పొడిబారడంతోపాటు స్కాల్ప్ కూడా ఈ సమస్య బారిన పడకుండా ఉంటుంది. చుండ్రు చెడుగా కనిపించడమే కాకుండా దురద మరియు చికాకును కూడా కలిగిస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే అస్సలు భయపడకండి. కొన్ని హోం రెమెడీస్ సహాయంతో, మీరు చుండ్రును సులభంగా వదిలించుకోవచ్చు.
చుండ్రు ఎందుకు వస్తుంది ?
పొడిబారడం: చలికాలంలో శిరోజాలు పొడిబారడంతో పాటు తలలో మృతకణాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
ఆయిలీ స్కాల్ప్: విపరీతమైన ఆయిల్ స్కాల్ప్ కూడా చుండ్రుకు కారణం కావచ్చు.
ఈస్ట్ ఇన్ఫెక్షన్: తలపై ఈస్ట్ పెరగడం ప్రారంభమయితే కూడా చుండ్రు పెరుగుతుంది.
తామర లేదా సోరియాసిస్-ఈ చర్మ వ్యాధులు కూడా చుండ్రుకు కారణం కావచ్చు.
చుండ్రు వదిలించుకోవడానికి హోం రెమెడీస్:
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె తలకు తేమను అందించి చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కాస్త కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేసి తలకు పట్టించి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో వాస్ చేసుకోవాలి.
పెరుగు: పెరుగులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగును తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయడం ద్వారా చుండ్రు తగ్గుతెంది. ఫలితంగా జుట్టు రాలకుండా ఉంటుంది.
నిమ్మరసం: నిమ్మరసం శిరోజాలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి.
అలోవెరా: కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్‌ను తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.
శనగ పిండి: శనగపిండి స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా మృత చర్మ కణాలను తొలగిస్తుంది. శనగపిండిని పెరుగు లేదా నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి.30 నిమిషాల తర్వాత కడగాలి.
వేప : వేపలో యాంటీ ఫంగల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి.
Also Read: కొబ్బరి నూనెతో.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
యాపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చుండ్రుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయాలి.
టీ ట్రీ ఆయిల్ : ట్రీ ఆయిల్‌లో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా జుట్టు రాలకుండా ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.