BigTV English

Sandeep Reddy Vanga : సరిగ్గా వన్ ఇయర్ క్రితం వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు

Sandeep Reddy Vanga : సరిగ్గా వన్ ఇయర్ క్రితం వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు

Sandeep Reddy Vanga : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన ఒక మామూలు కథని తనదైన శైలిలో చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు దర్శకుడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో, అదే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి. ఇదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు. సాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమాకి బాలీవుడ్ లో అన్ని రివ్యూ అండ్ రేటింగ్స్ నెగిటివ్ గా వచ్చాయి. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కట్టబెట్టారు.


బాలీవుడ్ లో చాలామంది రివ్యూ రైటర్స్ కు సందీప్ రెడ్డి వంగకి మధ్య ఒక వార్ నడిచింది. ఒక సందర్భంలో మీరు నెక్స్ట్ తీయబోయే సినిమా ఇలా వైలెంట్ గా ఉండకూడదు అని కోరుకుంటున్నాను అని ఒక ప్రముఖ జర్నలిస్ట్ సందీప్ రెడ్డి వంగాతో అంటారు. ఆ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ ‘ఇట్ విల్ బి మోర్’ అసలు వైలెంట్ ఫిలిం అంటే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ రెడ్డి అప్పుడే అనిమల్ సినిమాను అనౌన్స్ చేశాడు. అనిమల్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తండ్రి కొడుకులు మధ్య ఉన్న బాండింగ్ను తనదైన స్టైల్ లో చూపించి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. సినిమా అంటే ఇలానే ఉండాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి సినిమా అంటే ఇలా కూడా చేయొచ్చు అని నిరూపించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలమైన విజయాన్ని సాధించి దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. చాలామంది బాలీవుడ్ రివ్యూ రైటర్స్ కు సక్సెస్ తో సమాధానం చెప్పాడు సందీప్.

డిసెంబర్ 1 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో పడినప్పుడు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సందీప్ రెడ్డి వంగ రన్బీర్ కపూర్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. అన్నిటిని మించి ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక సినిమాకి మ్యూజిక్ ఎంత కీలకమని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కొంతమంది దర్శకులు చెప్పి మరి హిట్ సినిమాలు కొడుతుంటారు. ఇక సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే అసలైన వైలెంట్ అంటే ఏంటో చూపిస్తానంటూ చెప్పు మరి రన్బీర్ కపూర్ లాంటి హీరోతో ఒక కమర్షియల్ సక్సెస్ఫుల్ సినిమాను చేశాడు. ఇక ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ తో పాటు అద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. సరిగ్గా సెన్సేషనల్ హిట్ సాధించిన అనిమల్ సినిమాకి నేటితో ఏడాది పూర్తయింది.


Also Read : Chiranjeevi New Movie : శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి… ఈ కాంబోను అసలు ఎక్స్పెక్ట్ చేయరు..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×