BigTV English

Lucky Baskhar OTT: భాస్కర్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్లు, ఓటీటీ లో వ్యూస్ పెరుగుతున్నాయి

Lucky Baskhar OTT: భాస్కర్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్లు, ఓటీటీ లో వ్యూస్ పెరుగుతున్నాయి

Lucky Baskhar OTT : దుల్కర్ సల్మాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు దుల్కర్ సినిమాలను అర్థం కాకపోయినా కూడా చాలామంది సినిమా ప్రేమికులు సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి సినిమాలు చూసేవాళ్ళు. తెలుగు ప్రేక్షకుల గురించి తెలిసిందే. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా దానిని చూడడం మొదలుపెడతారు. కేవలం చూడడం మాత్రమే కాకుండా ఆ సినిమా గురించి పదిమందికి తెలిసేలా సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడతారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అంతా ఇండియన్ సినిమా అనే స్థాయికి వచ్చేసారు. తెలుగు సినిమా దర్శకులే ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలామంది ఇతర భాషల్లో స్టార్డం ఉన్న హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇదివరకే ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఇక రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేసి తన కెరీర్లో మొదటిసారి 100 కోట్లు కలెక్షన్స్ ను చూశాడు.


లక్కీ భాస్కర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు వంశీ. వంశీ చెప్పినట్లుగానే ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. బ్యాంకులో జరిగే స్కాం ను అందరికీ అర్థమయ్యేటట్లు చాలా అద్భుతంగా తీశాడు వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి ఇంత గొప్ప సినిమా తీశాడు అంటే నమ్మబుద్ధి కావట్లేదు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా చేశారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. థియేటర్లో కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ సినిమా నవంబర్ 28న నెట్ ఫిక్స్ లో విడుదలైంది.

ఈ సినిమాకి ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. అంతేకాకుండా 15 దేశాల్లో నెట్ఫ్లిక్స్ టాప్ చార్ట్స్ లో నిలిచింది. దుల్కర్ సల్మాన్ కు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అంతేకాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా మంచి పాపులారిటీ లభించింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే వెంకీ అట్లూరి ఈ సినిమా డిజైన్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు స్లో పేజ్ డ్రామాగా కాకుండా సినిమా పరుగులు తీస్తూనే ఉంటుంది. బీభత్సమైన ఫైట్లు లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కొన్ని సీన్స్ తోనే హై వచ్చేలా డిజైన్ చేశాడు వెంకీ. ముఖ్యంగా భాస్కర్ పాత్రలో దుల్కర్ ఒదిగిపోయిన తీరు చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు ఒక మిడిల్ క్లాస్ వాడు గెలుస్తుంటే మనకు ఆనందంగా అనిపిస్తుంది. అచ్చం భాస్కర్ ని కూడా ఈ సినిమాలో చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ చాలా మందికి కలిగింది. 1992 హర్షద్ మెహతా స్కామ్ లో బలవకుండా తప్పించుకున్న ఒక బ్యాంక్ ఎంప్లాయి కథ ఈ లక్కీ భాస్కర్.


Also Read : Sandeep Reddy Vanga : సరిగ్గా వన్ ఇయర్ క్రితం వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు

Related News

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

OTT Movie : ఒకేసారి నలుగురు స్కూల్ పిల్లల ఆత్మహత్యలు… క్షుద్ర పూజలతో హడలెత్తించే కొరియన్ హర్రర్ మూవీ

Our Fault Trailer : అమెజాన్ లో అరాచకం సృష్టించిన అడ*ల్ట్ మూవీ పార్ట్ 3 రెడీ… ట్రైలర్ లోనే అంతా చూపించారే

OTT Movie : అర్ధరాత్రి తల్లీపిల్లల్ని టార్గెట్ చేసే సైకో… ఆమె ఇచ్చే ఝలక్ నెవర్ బిఫోర్… మైండ్ బెండింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×