Neem Face Pack: వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వేప చెట్టు మొదలు నుంచి ఆకు వరకు ప్రతిదానికి ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని సహజ యాంటీబయటిక్‌గా చెబుతుంటారు. అందులోని పోషకాలు కూడా చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
వేపాకులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మవ్యాధులు, గాయాల వంటి సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. అందుకే వీటిని కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న వేపాకు ఫేస్ ప్యాక్ ఫేస్ కి అప్లై చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.
కొన్ని రకాల సబ్బుల తయారీలోనూ వేప ఆకులను వాడుతుంటారు. అంతే కాకుండా ఫేస్ ప్రొడక్ట్ లల్లోనూ వీటిని వాడతారు. రకరకాల ఫేస్ ప్యాక్ లు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వేపాకు ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతగా మారుతుంది.
ఫేస్ ప్యాక్ వల్ల లాభాలు..
వేపాకు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్య ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా ఇది చంపి వేస్తుంది. ముఖంపై మురికిని తొలగించి మొటిమలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ముఖంపై ఉన్న జిడ్డను వేపాకు తొలగిస్తుంది. చర్మం ఎల్లప్పుడూ కాంతి వంతంగా మెరుస్తూ ఉండాలని అనుకునే వారికి వేపాకు ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్స్ !
వేపాకు ఫేస్ ప్యాక్ తయారీ విధానం..
మొదటగా ఒక చిన్న కప్పు వేపాకులు తీసుకోవాలి. అదే కప్పుతో తులసి ఆకులు తీసుకుని రెండింటినీ శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఆ ఆకులను నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకోవాలి. కళ్ళ కింద పెట్టుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ఫేస్ ప్యాక్‌ను 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ లో తులసి ఆకులను కూడా కలిపడం వల్ల మీ చర్మం ఆరోగ్యవంతంగా మెరుస్తూ ఉంటుంది. కాకపోతే ఏ ఫేస్ ప్యాక్ అయినా మొదట ముఖానికి వేసుకునే ముందు మోచేతికి వేసుకుని చూడాలి. దురద లాంటివి రాకపోతే ఆ తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఎంత న్యాచురల్ అయినా.. సున్నితమైన చర్మం ఉన్న వారికి చర్మ సమస్యలు వస్తాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)