BigTV English

Multani Mitti Face Packs: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్స్ !

Multani Mitti Face Packs: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్స్ !

Multani Mitti Face Packs: ఎన్నో ఏళ్లుగా చర్మ సంరక్షణ కోసం ముల్తానీ మిట్టిని ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మిట్టి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా అన్ని  చర్మ రకాలకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. జిడ్డు చర్మంతో పాటు ఫేస్‌పై మొటిమలకు ఉన్న వారు కూడా ముల్తానీ మిట్టితో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను వాడవచ్చు. దీని వల్ల చర్మం మెరుస్తూ  కనిపిస్తుంది.


ముల్తానీ మిట్టిలో నూనెను గ్రహించి, మొటిమలను తగ్గించే గుణాలు ఉంటాయి. అంతే కాకుండా ముల్తానీ మిట్టి చర్మాన్ని లోతుల నుంచి శుభ్రం చేస్తుంది. మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న ముల్తానీ మిట్టితో ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ముల్తానీ మిట్టితో తయారు చేసే ఫేస్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

4 ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్స్..


1. ఆయిల్ స్కిన్ కోసం ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్

కావలసినవి:
ముల్తానీ మిట్టి – 2 టీస్పూన్లు
పెరుగు- 1 టీస్పూన్
నిమ్మరసం- కాస్త

తయారీ విధానం : పై అన్ని పదార్థాలను బాగా కలపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న అదనపు నూనెను గ్రహిస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా కూడా చేస్తుంది.

2. మొటిమలు ఉన్న చర్మానికి ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్..

కావలసినవి:
ముల్తానీ మిట్టి- 2 టీస్పూన్లు
చందనం పొడి- 1 టీస్పూన్
తేనె-1 టీస్పూన్

తయారీ విధానం: అన్ని పదార్థాలను కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మొటిమల ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను డ్రై చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మచ్చలను తగ్గుతాయి.

3. డల్ స్కిన్ కోసం ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్..

కావలసినవి:
ముల్తానీ మిట్టి- 2 టీస్పూన్లు
రోజ్ వాటర్- 1 టీస్పూన్
గ్లిజరిన్ -1 టీస్పూన్

తయారీ విధానం: పై అన్ని పదార్థాలను కలపి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్‌ని ముఖంపై పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాకుండా చర్మానికి మెరుపు తెస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది.

Also Read: అందంగా కనిపించాలా..? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే !

4. మెరిసే చర్మం కోసం ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్..

కావలసినవి:
ముల్తానీ మిట్టి-2 టీస్పూన్లు
టమోటా రసం- 1 టీస్పూన్
పెరుగు- 1 టీస్పూన్

తయారీ విధానం: పై అన్ని పదార్థాలను కలపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్‌ని ముఖంపై పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం యొక్క టాన్ తగ్గిస్తుంది. చర్మాన్ని ఫెయిర్‌గా మార్చుతుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×