BigTV English

New car smell causes cancer : కొత్త కార్ల వాసన వల్ల క్యాన్సర్ సూచనలు..

New car smell causes cancer : కొత్త కార్ల వాసన వల్ల క్యాన్సర్ సూచనలు..
New car smell causes cancer

New car smell causes cancer : ఈరోజుల్లో పీల్చే గాలి కూడా హానికరంగా మారింది. మనం పీల్చుకుంటున్న గాలిలో ఎలాంటి హానికరమైన గ్యాసులు కలుస్తాయో తెలియకపోవడం వల్ల అవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే మనకు తెలియకుండానే మనం తరచుగా పీల్చుకునే కొన్ని వాసనలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా కొత్త కారు వాసన కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.


కొత్త కారు నుండి వచ్చే వాసనలో హానికరమైన కెమికల్స్ ఉంటాయని, దాని వల్ల మనిషికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ విషయం చాలామందిని షాక్‌కు గురిచేసింది. మామూలుగా కారులు, ట్రక్స్ లాంటివి తయారు చేస్తున్నప్పుడు ఆఫ్ గ్యాసింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. దీని వల్ల అనేక రకాల కెమికల్స్ విడుదలవుతాయి. అందులో కొన్ని ఆ కొత్త కార్లలో, ట్రక్స్‌లోనే ఉండిపోతాయి. ఈ కెమికల్స్ వాసనే మనం కొత్తగా కొన్న కార్లలో, ట్రక్స్‌లో పలకరిస్తుంది.

హార్వార్డ్, బీజింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొత్తగా కొన్న ఒక బ్రాండ్ కారును 12 రోజుల పాటు పరిశోధించి చూశారు. అందులో 20 రకాల కెమికల్స్‌ను వారు కనుగొన్నారు. అందులో క్యాన్సర్‌కు కారణమయ్యే ఫార్మల్డీహైడ్ కూడా ఉందని గమనించారు. మామూలుగా మన చుట్టూ ఉండే గాలిలో ఫార్మల్డీహైడ్ కొంత మోతాదులో ఉన్నా అది ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలిగించదు. కానీ కొత్త కార్లలో దీని శాతం ఉండాల్సిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


కొత్త కార్లలో శాస్త్రవేత్తలు కనిపెట్టిన కెమికల్స్ ముఖ్యంగా డ్రైవర్లకే ఎక్కువగా ప్రమాదాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఫార్మల్డీహైడ్‌తో పాటు కార్సినోజెన్ అనే కెమికల్‌ను కూడా వారు కొత్త కార్లలో కనుగొన్నారు. ఇది గాలిని 61 శాతం పొల్యూట్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ కెమికల్ వల్ల ఎక్కువసేపు కార్లను డ్రైవ్ చేస్తున్నవారికి ప్రమాదం అని హెచ్చరించారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ కెమికల్స్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ కెమికల్స్ అనేవి మామూలు మోతాదులో ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని, కానీ కొత్త కార్లను ఈ కెమికల్స్ శాతం విషంతో సమానమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కెమికల్స్ ఉండడం సమస్య కాదని, దాని క్వాంటిటీనే సమస్య అని చెప్తున్నారు. కొత్త కార్ల వాసన వల్ల ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే ఆ వాసన వల్ల కొందరికి కడుపులో తిప్పడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందుకే కొత్త కార్లు ఆరోగ్యానికి హానికరం కావు అని తెలియాలంటే వాటిలో ఏ వాసన లేకపోవడమే సూచన అని తెలిపారు. అంతే కాకుండా కొత్త కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు విండోస్ తెరిచి పెట్టుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×