E-Paper
Advertisement

రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం పై సోనాక్షి సిన్హా కౌంటర్!

రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం పై సోనాక్షి సిన్హా కౌంటర్!
Advertisement

Sonakshi Sinha:సోనియాగాంధీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను, తన భర్త రాజీవ్ గాంధీ తో ఉన్న జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ ఒక పుస్తకాన్ని రచించి..2026 నవంబర్ 16న న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. ‘బిలాంగింగ్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించగా.. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కంగనా రనౌత్ ఈ పుస్తకం పై చేసిన కామెంట్లకు ఆమెపై ఏకంగా పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదయింది.ఇదిలా ఉండగా ఈ పుస్తకాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లిదండ్రులు సోనియాగాంధీ, దివంగత రాజకీయ నేత రాజీవ్ గాంధీ మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పిన చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వివాదానికి దారితీసింది..

భార్యాభర్తల బంధాన్ని ప్రశ్నించడం ఏంటి?

ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించడం మరింత చర్చనీయాంశంగా మారింది. భార్య భర్తలు ప్రేమను వ్యక్తపరచుకోవడాన్ని తప్పు పట్టడం ఏంటి? అంటూ ప్రశ్నించిన ఒక పోస్టును షేర్ చేస్తూ తనదైన శైలిలో సరదాగా కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. బిలాంగింగ్స్ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ సందర్భంగా రాహుల్ గాంధీ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఇంట్లో భోజనం చేసే సమయంలో తన తల్లి సోనియాగాంధీ తరచూ తన తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని, చిన్నప్పుడు ఈ సంఘటన నాకు చాలా సహజంగా అనిపించేది. కానీ నా స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు మాత్రం ఇలా ఉండకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. కానీ మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఒకరిపై మరొకరు చూపించుకునే ప్రేమను చూస్తూనే ,నేను నా సోదరి ప్రియాంక పెరిగాము అంటూ వివరించారు రాహుల్ గాంధీ.

Advertisement

also read: నిర్ణయం తీసుకోలేని వారు విజేత ఎలా అవుతారు.. ముఖేష్, త్రిగుణ్ పై నెటిజన్స్ ఫైర్!

రాహుల్ గాంధీకి అండగా.. సోనాక్షి పరోక్ష కౌంటర్..

ఇకపోతే రాహుల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో కొంతమంది రాజకీయ నాయకులు ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ విమర్శించగా.. మరికొందరు భార్యాభర్తల మధ్య ప్రేమను వ్యక్తపరచడంలో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంలోకి సోనాక్షి కూడా భాగమవుతూ..’Woemaniyah’ అనే ఇంస్టాగ్రామ్ పేజీలో భార్యాభర్తల అనుబంధాన్ని కూడా విమర్శించడం ఏంటి అంటూ వచ్చిన ఒక పోస్టును ఆమె తన స్టోరీలో షేర్ చేస్తూ.. భవిష్యత్తులో నాకు పుట్టబోయే పిల్లలకు ఏం ఎదురు కాబోతోందో ఇప్పుడే తెలియదని, దానికి సిద్ధంగా ఉండాలి అంటూ ఆమె నవ్వుతున్న ఏమోజీలను షేర్ చేస్తూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. మొత్తానికైతే ఈమె స్పందన ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుచుకోవడాన్ని విమర్శిస్తున్న వారికి పరోక్ష కౌంటర్గా నిలిచింది . మొత్తానికైతే సోనాక్షి సిన్హా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

రామ్ పోతినేని నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్!

‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?

‘రామాయణ’ మూవీ క్రేజే వేరయా.. మరో సెన్సేషనల్ మార్క్..!

Big Stories

Advertisement
×