E-Paper
Advertisement

రామ్ పోతినేని నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్!

రామ్ పోతినేని నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్!
Advertisement

Ram Pothineni:రామ్..ఎనర్జిటిక్ స్టార్ గా ఎన్నో సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ వెర్సటైల్ స్టార్ ఇపుడు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. గత కొంతకాలంగా ఫ్లాపులతో సావాసం చేస్తున్న రామ్ ఇపుడు తనే దర్శకత్వం చేస్తూ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే.

ఇక యాక్షన్ జానర్ లో వస్తున్న ఈ సినిమా కోసం రామ్ ఇప్పటికే తన లుక్ ని టోటల్ గా మార్చేయడంతో ఆడియన్స్ లో ముఖ్యంగా రామ్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది.ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి కొన్ని అప్ డేట్స్ బయటికి రావడంతో, అసలు రామ్‌ను ఇందులో ఎలా చూపిస్తారు, తన పాత్రలో ఏం కొత్తదనం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా డిబేట్లు పెట్టేస్తున్నారు.

Advertisement

ఇక ఈ క్రమంలోనే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా రామ్ తన కొత్త సినిమా నుంచి ఒక ఇంటెన్స్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమైపోతోంది. కూడా పెద్ద గ్రాండ్ సెట్ బ్యాక్‌డ్రాప్‌లో మెట్లెక్కి వెళ్తున్న రామ్, ఒక చేతిలో టెడ్డీ బేర్‌ను, ఇంకో చేతిలో మెషిన్ గన్‌ను పట్టుకొని కనిపించాడు. మామూలుగా టెడ్డీ బేర్ అంటే చిన్న పిల్లల బొమ్మ , కానీ పక్కనే పవర్‌ఫుల్ మెషిన్ గన్ ఉండటంతో ఈ పోస్టర్‌కు ఒక స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చిందనే చెప్పాలి.

ఇక రామ్ లుక్‌లో కనిపిస్తున్న ఆ ఇంటెన్సిటీ ఫ్యాన్స్‌కు బాగా నచ్చేస్తాయనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటివరకు రామ్ సినిమాల్లో చూసిన ఎనర్జీకి భిన్నంగా, ఈసారి మరింత రఫ్‌గా, సీరియస్‌గా కనిపించబోతున్నాడని ఈ ప్రీ లుక్ తో క్లారిటీ వచ్చేసింది. అసలు చేతిలో టెడ్డీ బేర్ ఎందుకు ఉంది, దాని వెనుక ఏమైనా స్టోరీ ఉందా, లేదంటే సినిమాలో వచ్చే ఏదైనా సీన్‌కు హింట్ ఇస్తున్నారా అనేది మరిన్ని అప్ డేట్స్ వస్తే కాని తెలిసేలా లేదు.

Advertisement

ఇక ఈ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను, టైటిల్ టీజర్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు రామ్ . అంటే సినిమా పేరు రోల్ , స్టోరీ బ్యాక్‌డ్రాప్ వంటి అనేక ప్రశ్నలకి అప్పుడే ఆన్సర్ రానుందన్న మాట.ఈ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తుండగా రామ్ అన్నయ్య కృష్ణ పోతినేని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెల్సిందే.

మొత్తానికి రామ్ పోతినేని ఈసారి హీరోగా మాత్రమే కాకుండా, తనలోని మరో యాంగిల్ చూపించాబోతున్నాడని అర్థమైపోయింది. టెడ్డీ బేర్, మెషిన్ గన్‌తో వచ్చిన ఈ ప్రీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.చూడాలి మరి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ వచ్చాక ఈ సినిమాపై అంచనాలు ఇంకా ఏ రేంజ్ కి వెళ్తాయో !

ALSO READ:నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

Tags

Related News

‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?

‘రామాయణ’ మూవీ క్రేజే వేరయా.. మరో సెన్సేషనల్ మార్క్..!

మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Big Stories

Advertisement
×