E-Paper
Advertisement

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!
Advertisement

Vizianagaram Elections: విజయనగరం జిల్లాలో మూడోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. డిసెంబర్ 2 న 9 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి అన్నారు. రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, మూడో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసిందని ఒక ప్రకటనలో జల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.

ఎన్నికలు..

ఈ విడతలో జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లకు చెందిన తొమ్మిది మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

Advertisement

విజయనగరం డివిజన్: భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ, విజయనగరం
చీపురుపల్లి డివిజన్: చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడి, గుర్ల

ఎన్నికల కార్యక్రమం

నవంబరు 21: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. అదే రోజు వార్డుల వారీ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఆరోజే ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. నవంబరు 23న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుందని,నవంబరు 24 ఉదయం 8 గంటల నుంచి పరిశీలన, నవంబరు 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని అధికారుల పేర్కోన్నారు. నవంబరు 26న అప్పీళ్లను అప్పిలేట్ అథారిటీ పరిష్కరిస్తుంది. నవంబరు 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం, ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబరు 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు.

ఉప సర్పంచ్ ఎన్నిక

Advertisement

ఫలితాలు వెలువడిన రోజునే నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో సాధ్యం కాకపోతే, సెలవు దినమైనా సరే మరుసటి రోజు జరుపుతారు. ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ప్రక్రియ సాగేలా ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు, ఓటర్లు, రాజకీయ పక్షాలు అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!

Tags

Related News

ఆంధ్ర-ఒడిశా వైపు.. తుఫాన్, ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటనుందంటే?

బోత్స అనూష పిటిషన్‌పై.. హైకోర్టు సంచలన తీర్పు..!

ఏపీలో జెడ్పీ పీఠాల పంపకాలు.. కొనసాగుతున్న ఉత్కంఠ, సీఎం చంద్రబాబుతో మరోమారు చర్చలు

ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు

ఏపీకి బిగ్ రిలీఫ్.. అక్వాన్ తుపాను ముప్పు తప్పినా.. ఆ ఆరు జిల్లాలకు వాన గండం!

భార్యకు సర్పంచ్‌గా అవకాశం దక్కలేదని భర్త ఆత్మహత్య!

ఆ రెండింటి మధ్య తేడా నీకు తెలీదా.. జగన్ పై నారా లోకేష్ సెటైర్లు!

Big Stories

Advertisement
×