E-Paper
Advertisement

పంది మాంసం తింటున్నారా? దాని జబ్బులన్నీ మీకే.. ఎందుకంటే?

పంది మాంసం తింటున్నారా? దాని జబ్బులన్నీ మీకే.. ఎందుకంటే?
Advertisement

Health Tips: రోజూ మంచి ఆహారం తీసుకుంటున్నా.. టైమ్‌కు నిద్రపోతున్నా.. శరీరానికి తగిన వ్యాయామం చేస్తున్నా కూడా కొంతమందిని ఎందుకో తెలియని నీరసం, ఒళ్లు నొప్పులు, కడుపులో ఏదో అసౌకర్యం వెంటాడుతూనే ఉంటాయి. అసలు దీనికి కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? మనకు తెలియకుండానే మన శరీరంలో చేరి రక్తాన్ని, పోషకాలను తాగేసే పరాన్నజీవులే (Parasites) దీనికి ప్రధాన కారణం. తాజా పరిశోధనల ప్రకారం.. సరిగ్గా ఉడకని పంది మాంసం వంటి ఆహారం ద్వారా ఇవి మన ఒంట్లోకి చేరుతాయట. వీటిలో కొన్ని రకాలు మన లోపల చేరి రోజుకు 1,500 గుడ్లు పెడుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

మన శరీరంలోకి ఎలా వస్తాయంటే?

ఈ పురుగులు బయట ఎక్కడో ఉండవు. మనం రోజూ వాడే వస్తువుల్లోనే ఉంటాయి. మనం తాగే నీరు, సరిగ్గా కడగని పండ్లు, ఆకుకూరలు, ప్రాణంగా చూసుకునే మన పెంపుడు కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఇవి మన శరీరంలోకి చొరబడతాయి. ఈ రోజుల్లో వీటిని పూర్తిగా అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. హోటళ్లలో తినే సగం ఉడికిన వంటకాలు, మట్టిలో ఆడుకునే పిల్లల ద్వారా ఇవి చాలా వేగంగా ఒంట్లోకి పాకుతాయి. ఇవి ఒక్కసారి కడుపులోకి వెళ్లాయంటే అక్కడే ఉండవు. రక్తం ద్వారా మన కణజాలాల్లోకి కూడా వెళ్లి తిష్ట వేస్తాయి.

Advertisement

Also Read: బాత్‌రూమ్ మూలలో ఉప్పు గిన్నె ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుకున్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇవి మనల్ని ఏం చేస్తాయి?

ఈ సూక్ష్మజీవులు చాలా గడుగ్గాయిలు. ఇవి మన శరీరంలో ఉన్న ఇనుము, సీసం వంటి లోహాలను వాడుకుని తమ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని (బయోఫిల్మ్) కట్టుకుంటాయి. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థ గానీ, మనం వాడే మందులు గానీ వాటిని ఏమీ చేయలేవు. అందుకే మనం ఎంత మంచి ఆహారం తిన్నా అవి మన శరీరానికి అంటకుండా ఈ పరాన్నజీవులే తినేస్తుంటాయి. ఫలితంగా చర్మంపై దద్దుర్లు రావడం, హార్మోన్ల అసమతుల్యత, గ్యాస్ సమస్యలు, ఎప్పుడూ అలసటగా ఉండటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎక్కడ పొరపాటు చేస్తున్నాం?

Advertisement

చాలా దేశాల్లో ప్రజలు క్రమం తప్పకుండా తమను తాము శుద్ధి చేసుకుంటారు (డివార్మింగ్). కానీ మన దగ్గర పెంపుడు జంతువులకు చేయించినంత శ్రద్ధ మన మీద మనం చూపించడం లేదు. ఏటా ఒకటి రెండు సార్లు కడుపులో పురుగుల మందు వేసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, ఈ హానికర పురుగులు బయటకు పోతాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ముఖ్యం. ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు.. మన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటీ?

మన ఇంటిని ఎలాగైతే పండగలకు, వారాంతాల్లో శుభ్రం చేసుకుంటామో.. మన శరీరాన్ని కూడా అలా లోపల నుంచి శుద్ధి (డెటాక్స్) చేయాలి. సహజమైన పద్ధతుల్లో పరాన్నజీవులను బయటకు పంపే అలవాట్లు అలవరచుకోవాలి. వీటితో పాటు శరీరంలో ఉండే విషపూరిత లోహాలను కూడా క్లీన్ చేసుకుంటే.. ఈ పురుగులు మళ్లీ మన శరీరంలో తిష్ట వేయవు. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాదు.. శరీరం మళ్లీ కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తుంది.

Also Read: జమ్మి మొక్కను ఏ దిశలో నాటితే అదృష్టం వరిస్తుంది? పూర్తి వివరాలు మీ కోసం..

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×