Diabetic Summer Drinks: షుగర్ ఉన్నవారు సోడా తాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సోడా రకాన్ని బట్టి దాని ప్రభావం రక్తంలో చక్కెర స్థాయిలపై గణనీయంగా మారుతుంది. సోడా రెండు రకాలుగా ఉంటుంది, ఈ రెండింటి ప్రభావం డయాబెటిస్ రోగులపై భిన్నంగా ఉంటుంది.
వేసవిలో ఎక్కువగా దాహం అనిపిస్తుంది. ఈ సమయంలో ఏదైనా తాగాలంటే అప్పుడు మీరు కూల్ డ్రింక్స్ వద్దు మేము హేల్తిగా తాగాలి అనుకుంటే అప్పుడు అందరు. నిమ్మకాయ నీరు తాగుతుంటారు. అయితే నిమ్మకాయ నీటిలో కొద్దిగా సోడా కలిపితే బాగుంటుందని వేసుకుంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవాళ్లు సోడా తాగవచ్చా? లేదా? అని చాలా మంది అనుకుంటారు.
అయితే డయాబెటిస్ ఉన్నవారు నాచురల్‌గా దోరికే చెరుకు రసం, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అలాగే మజ్జిగా కాస్త ఉప్పు తగ్గింది తీసుకోవడం చాలా మంచిది. సోడా తాగడం వల్ల అందులో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ డయాబెటిస్ వాళ్లకు అసిడీటిని కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
సోడాలో చాలా రకాల రసాయానాలు, అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది, ఇది డయాబెటిస్ రోగులకు అత్యంత ప్రమాదకరం. ఇది హైపర్ గ్లైసీమియా కలిగిస్తుంది. సోడాలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుకోవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
బరువు పెరుగుతారు:
కొందరు డైట్ సోడా మంచిదని తాగుతారు.. కానీ డైట్ సోడాలో చక్కెర ఉండదు, కానీ అది కూడా మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. డైట్ సోడాలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేయనప్పటికీ, అవి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అంతే కాకుండా సోడా తాగడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: అన్నం తిన్న వెంటనే నడిస్తే లాభమా నష్టమా? ఎన్ని అడుగులు వేయాలి?
పండ్లు రసాలు:
పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతుంటారు. అయితే అదే పనిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపెణులు పేర్కోంటున్నారు. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుందని అయితే పండ్ల రసాల్లో ఫైబర్ చాలావరకు కోల్పోతామని చెబుతున్నారు.
తీసుకోవాల్సిన పానీయాలు
. నీరు తాగడం వల్ల మీరు హైడ్రేట్ గా ఉంటారు. ఇది మూత్రపిండాల పని తీరును మెరుగుపరుస్తుంది.
. అలాగే గ్రీన్ టీ డయాబెటిస్ తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిన కొన్ని అధ్యయనాల్లో తెలిపారు.
. పిప్పిర్ మెంట్ టీలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
. కూరగాయల రసంలోని ఖనిజాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
. యాపిల్ సైడర్ వెనిగర్‌లో నీటిని కలిపి తీసుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది రక్తప్రవాహంలో కార్బోహైడ్రేట్‌లను తగ్గిస్తుంది.