Metro: బెంగళూరులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసినందుకు పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశార. ఆడవారికి తెలియకుండా అసభ్యకరంగా వీడియోలు రకార్డ్ చేసి వాటిని ‘బెంగళూరు మెట్రో చిక్స్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో చర్యలు తీసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ఖాతా 5,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.అందుకే ఈ సంఘటన ఆందోళనలకు దారితీసింది.
ఈ ఖాతాను గుర్తించి, ఎక్స్‌లో ఒక యూజర్ బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తక్షణమే పోలీసులు స్పందించారు. మెట్రో కోచ్‌లలో, ప్లాట్‌ఫామ్‌లపై, అనుమతి లేకుండా తీసిన ఫోటోలు, వీడియోలు ఈ ఖాతాలో పోస్ట్ అయ్యాయి. కొంతమంది మహిళల అసభ్యకరమైన వీడియోలు కూడా ఉన్నాయని సమాచారం. దీంతో మెట్రో ప్రయాణికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు సరైన సమయంలో స్పిందించి యాక్షన్ తీసుకోవడంతో ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ నుంచి ఫోటోలు వీడియోలు డిలీట్ అయ్యాయి. అంతేకాకుండా, ఈ ఖాతాకు అనుబంధంగా ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌ను కూడా డిలీట్ చేయడంతో పాటు ఇతర చర్యలు తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
BMRCL స్పందన
ఈ సంఘటనపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) కూడా స్పిందించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆడవారి భద్రత గోప్యత విషయంలో ఎవరైన తప్పుగా వ్యవహరిస్తే ఏ మాత్రం సహించబోదని పేర్కొంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బనశంకరి పోలీస్ స్టేషన్‌లో 14 అభ్యంతరకర వీడియోలను గుర్తించి, వాటి కోసం ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అయితే, ఈ ఖాతాను నడిపిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఆందోళన
ఈ సంఘటన సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై పెద్ద చర్చను మొదలుపెట్టింది. మహిళల గోప్యతను ఉల్లంఘించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ ఘటనపై ప్రజలు, యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు.ఇలాంటి చర్యలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తప్పనిసరి
పోలీసులు ఈ ఫిర్యాదు స్వీకరించిన వెంటనే వేగంగా స్పందించి, కఠిన చర్యలు చేపట్టా. నెటిజన్లు, పోలీసులు చూపిన చొరవను ప్రశంసించారు. అయితే, కొందరు ఈ ఘటనకు సంబంధించి మరో విమర్శను వినిపించారు. మెట్రోలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, భద్రతా చర్యలు సక్రమంగా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇదే నేపథ్యంలో BMRCLపై కూడా విమర్శలు వస్తున్నాయి. మెట్రోలో జరిగే ఈ తరహా సంఘటనలు నివారించేందుకు మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.
గోప్యత లేదా?
ఈ సంఘటన డిజిటల్ యుగంలో గోప్యత రక్షణకు సంబంధించి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సంఘటనలు పెద్ద నగరాలలో ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణంగా చట్టపరమైన చర్యలు మరింత పటిష్టంగా ఉండాలని, సామాజిక అవగాహన పెంచాలని యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు.
ల్లంఘనలపై చట్టపరమైన పరిష్కారాలు, మరింత కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేస్తుంది.