BigTV English

Theaters Close : నిర్మాతలతో చర్చలు ఫెయిల్… జూన్ 1 థియేటర్స్ బంద్‌పై కీలక నిర్ణయం

Theaters Close : నిర్మాతలతో చర్చలు ఫెయిల్… జూన్ 1 థియేటర్స్ బంద్‌పై కీలక నిర్ణయం

Theaters Close: తెలుగు రాష్ట్రాల్లో సినిమా ధియేటర్ ల ఎగ్జిబిటర్లు ఓ సంచల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుండి ధియేటర్లన్ని బంద్ చేయాలని నిర్ణయించారు.దాంతో నిర్మాతలు చర్చకు ఆహ్వానించారు.ఇక నిర్మాతలతో చర్చలు ఈరోజు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రి రవి, నాగ వంశీ,దానయ్య ,సాహు గారపాటి తదితరులు విచ్చేశారు. సమావేశంలో ఎగ్జిబిటర్లతో నిర్మాతలు జరిపిన చర్చలపై ఎగ్జిబిటర్ లు కీలక నిర్ణయానికి వచ్చారు. ఆ వివరాలు చూద్దాం..


జూన్ 1 థియేటర్స్ బంద్‌పై కీలక నిర్ణయం..

ఈరోజు ఉదయంహైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో   11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశం అయ్యారు.  40 మంది డిస్ట్రిబ్యూటర్లతో, ప్రముఖ నిర్మాతలతో ఈ సమావేశం జరిగింది. సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు ప్రొడ్యూసర్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లలో మెజార్టీ సభ్యులు సమ్మె వద్దు థియేటర్లు రన్ చేస్తూనే ఈ సమస్యను పరిష్కరించాలి అని నిర్ణయించారు. గతంలోనూ క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేయడం వల్ల ఆర్టిస్టులు ఎంతో ఇబ్బంది పడిన విషయాలను ,ఆర్టిస్ట్ పారితోషకం విషయంలో మరోసారి సమ్మె జరిగినప్పుడు షూటింగ్ నిలిపివేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ రెండు విషయాలలోనూ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ధియేటర్లు మూతపడకుండా సినిమాలు హాల్లో రన్ చేస్తూనే, ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు తెలిపిన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.


నిర్మాతలతో చర్చలు..

ఎగ్జిబిటర్లు అద్దె ప్రతిపాదన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని బదులుగా లాభాల్లో పర్సంటేజ్ ఇవ్వాలని వారి సమస్యల నిర్మాత ఎదుట ఉంచారు. అదే విధానంలో థియేటర్లు రన్ చేస్తే వారికి నష్టాలు కలుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలు ఒకటి రెండు వారాలు మాత్రమే ఆడుతున్నాయి. ఇందులో మొదటి మూడు రోజుల్లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి అయితే అద్దె విధానం వల్ల ఎగ్జిబిటర్లకు తగిన లాభం రావట్లేదని వారు వాదిస్తున్నారు. మరోవైపు పైరసీ సమస్య కూడా నిర్మాతలను ఎగ్జిక్యూటర్లకు పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. సినిమాలు విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది ఎగ్జిబిటలకు ఆదాయంపై ప్రభావం చూపడంతో పాటు నిర్మాతలకు పెద్ద సమస్యగా మారింది. ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను నిర్మాతలు అంగీకరించకపోతే జూన్ 1 నుంచి ధియేటర్లు మూసివేయాలని అనుకున్నారు.  అయితే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఒక మాట పై వచ్చి, థియేటర్లో సినిమాలు రన్ చేస్తూనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సినీ ప్రేమికులు మే నెల జూన్ మొదటి వారాల్లో ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదల కు ఎటువంటి ఆటంకం ఉండదని ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×