Bread halwa recipe: మన దేశంలో పండగలు, పెళ్లిళ్లు లేదా ఏ చిన్న వేడక జరిగినా స్వీట్లు ఉండాల్సిందే. అందులోనూ భోజనంతో.. పాటు వేడి వేడిగా వచ్చే స్వీట్ ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఫంక్షన్లలో బ్రెడ్ హల్వాకు ఉండే క్రేజే వేరు. చాలామంది ఇళ్లలో బ్రెడ్ హల్వా చేసినా ఆ ఫంక్షన్లలోని పర్ఫెక్ట్ టేస్ట్, ఆ రిచ్ లుక్ రాదని ఫీలవుతుంటారు. అయితే కేవలం కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే, అచ్చం కేటరింగ్ స్టైల్‌లో అదిరిపోయే బ్రెడ్ హల్వాను మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
వైట్ బ్రెడ్ స్లైసెస్ – 10 నుంచి 12
నెయ్యి – సరిపడా
పంచదార – 1 కప్పు
నీళ్లు – 1.5 కప్పులు
కాచి చల్లార్చిన పాలు – 1 కప్పు
జీడిపప్పు, కిస్మిస్ – గుప్పెడు
యాలకుల పొడి – 1 స్పూన్
కుంకుమపువ్వు (లేదా ఫుడ్ కలర్) – చిటికెడు
1. మొదటగా బ్రెడ్ స్లైసెస్ అంచులను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సరిపడా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసిన.. బ్రెడ్ ముక్కలను అందులో వేసి, మంటను మీడియంగా ఉంచి మంచి గోధుమ రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. నూనెకు బదులుగా పూర్తిగా నెయ్యిలో వేయిస్తేనే అసలైన ఫంక్షన్ టేస్ట్ వస్తుంది.
2. అదే నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 1 కప్పు పంచదార, 1.5 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి నీరు మరుగుతున్నప్పుడు, కొద్దిగా కుంకుమపువ్వు లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి. దీనివల్ల హల్వాకు మంచి రంగు వస్తుంది. పాకం ఎక్కువ రావాల్సిన అవసరం లేదు, పంచదార కరిగి నీరు బాగా మరిగితే సరిపోతుంది.
Also Read: క్యాబేజీ పప్పు ఇలా చేస్తే..ఎవ్వరైనా లొట్టలేసుకుంటూ తింటారు!
3. మరుగుతున్న పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి. బ్రెడ్ పాకాన్ని పీల్చుకున్న వెంటనే, అందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలను పోయాలి. మంటను తక్కువ చేసి, గరిటెతో బ్రెడ్ ముక్కలను మెత్తగా మ్యాష్ చేస్తూ కలపాలి. పాలు, పాకంలో బ్రెడ్ బాగా ఉడికి హల్వా రూపంలోకి వస్తుంది. హల్వా దగ్గర పడుతున్న సమయంలో మిగిలిన నెయ్యి, యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. అంచులకు నెయ్యి వదిలే.. వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే..ఫంక్షన్ స్టైల్ బ్రెడ్ హల్వా రెడీ!
ఈ బ్రేడ్ హల్వాను వేడి వేడిగా తింటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. ఒక వేళ చల్లారినా.. దీని టేస్ట్ అస్సలు తగ్గదు. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా పండగ రోజుల్లో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా ఈ స్వీట్ తయారు చేయెచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్‌లో మీ ఇంట్లో కూడా ఫంక్షన్ స్టైల్ బ్రెడ్ హల్వాను ట్రై చేసి టేస్ట్ చేయండి.