E-Paper
Advertisement

అల్లా మీద ఒట్టు, వైభ‌వ్, అభిషేక్ ల‌ను పాకిస్తాన్ త‌ట్టుకోలేదు…50 ఓవ‌ర్ల‌లో 600 కొడ‌తారు

అల్లా మీద ఒట్టు, వైభ‌వ్, అభిషేక్ ల‌ను పాకిస్తాన్ త‌ట్టుకోలేదు…50 ఓవ‌ర్ల‌లో 600 కొడ‌తారు
Advertisement

BASIT ALI ON INDIA vs PAKISTAN:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (Asia Cup Rising Stars 2026 Tournament) నవంబర్ 19వ తేదీన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీం ఇండియా, పాకిస్తాన్ జూనియర్ జట్లను తమ తమ బోర్డులు ప్రకటించాయి. టీమిండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి భయంకరమైన బ్యాటర్లు స్థానం దక్కించుకున్నారు. దీనిపై పాకిస్తాన్ మాజీలు విమర్శలు చేస్తుంటే.. బాసిత్ అలీ (BASIT ALI) మాత్రం ఇండియాకు సపోర్ట్ గా నిలిచాడు. ఆటలో వయసుకు సంబంధం లేదని.. టాలెంట్ మాత్రమే కీలకంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.

వైభవ్ సూర్య వంశీ, అభిషేక్ శర్మ ఇద్దరూ ఓపెనర్లుగా దిగితే బీభత్సం సృష్టిస్తారని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు సరిగ్గా నిలబడితే.. 10 ఓవర్లలో 200 కొడతారని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరి వరకు వాళ్లు ఆడితే మాత్రం 50 ఓవర్లలో 600 పరుగులు రావడం చూడవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ దూకుడుకు పాకిస్తాన్ కొట్టుకుపోతుందని తెలిపాడు.

వైభవ్, అభిషేక్ ఇద్దరు రాక్షసులే.. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చినా బాసిత్ అలీ

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 22వ తేదీన ఈ మ్యాచ్ ఉంది. అయితే దీనిపై బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని అంచనా వేశాడు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరూ రాక్షసులేనని.. వాళ్లు చేసే ఎదురుదాడికి పాకిస్తాన్ చిత్తూ అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళిద్దరి వికెట్లు త్వరగా తీయగలిగితే పాకిస్తాన్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేశాడు. అలాగే ఈ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ కు టీమిండియా, పాకిస్తాన్ మాత్రమే వస్తాయని స్పష్టం చేశాడు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఈ సారి న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవాల్సిందే

Advertisement

ఆసియా కప్ ఎప్పుడు జరిగినా టీమిండియా గెలుస్తోందని… కానీ టైటిల్ మాత్రం తీసుకోవడం లేదని విమర్శలు చేశాడు బాసిత్ అలీ. ఇప్పటికే రెండు సార్లు ట్రోఫీ తీసుకోకుండా న‌ఖ్వీని బీసీసీఐ అవమానించిందని మండిపడ్డాడు. త్వరలో జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సందర్భంగా అయినా న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవాలని టీమ్ ఇండియాకు సూచనలు చేశాడు. దేశాల మధ్య గొడవను క్రికెట్ కు అంటగట్టకూడదని విమర్శించాడు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

BBL తొలి మ్యాచ్..ఇండియాను అవ‌మానించిన ముస్తాఫిజుర్…సెఫ్టీ లేదంటూ కామెంట్స్‌!

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ వెధ‌వ‌లే.. 2024 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న‌న్ను విల‌న్ చేశారు

ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్..ఇలాంటోళ్లు వ‌న్డేల‌కు ప‌నికిరారు!

RCB జ‌ట్టులో న‌ర‌కం అనుభ‌వించా..స్మృతి మంధాన అంద‌రినీ తొక్కేసింది!

విరాట్ కోహ్లీ ఒక్కడే మొనగాడు…అతడే లేకపోతే టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవదు

గిల్‌ను టార్గెట్ చేసిన పాక్ ఫ్యాన్స్…జొమాటో టీ షర్ట్ వేశాడంటూ ట్రోలింగ్ !

వర్షం పడి, లక్కీగా తొలి వన్డేలో టీమిండియా గెలిచింది..ఇంజమామ్ సంచలనం!

Big Stories

Advertisement
×