Pranay Murder case verdict: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది. హత్యలో కీలకపాత్ర పోషించిన ఏ-2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నల్గొండ న్యాయస్థానం. ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ముగ్గురు నిందితులు.
అసలేం జరిగింది?
ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న కోపంతో పగతో రగిలిపోయాడు తండ్రి మారుతిరావు. ఆనాటి నుంచి తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ని చంపాలని నిర్ణయించు కున్నాడు. ఈ బాధ్యతను ఉగ్రవాది అస్గర్ అలీకి అప్పగించాడు.
ప్లాన్ ప్రకారం..
ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ గ్యాంగ్ ద్వారా ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారు మారుతీరావు. ప్రణయ్‌ను అంతం చేసేందుకు ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు అస్గర్ అలీ. గుజరాత్ మాజీ హోంమంత్రి హరెన్ పాండ్యా హత్య కేసులో నిందితులు ఈ గ్యాంగ్‌లో ఉన్నారు. ఆ గ్యాంగ్ 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ను హత్య చేసింది.
పోలీసుల విచారణ
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2019 జూన్ 12న పోలీసుల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జీషీటు ఆధారంగా విచారణ చేపట్టిన నల్గొండ న్యాయస్థానం తీర్పును మార్చి 10కి రిజర్వ్ చేసింది.
ALSO READ: మూడేళ్ల పిల్లాడి ఎదుటే తల్లిపై అత్యాచారం
సుమారు ఐదున్నరేళ్ల పాటు విచారణ కొనసాగింది. ప్రణయ్ హత్య తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం తుది తీర్పు సోమవారం వెల్లడించింది.
న్యాయస్థానం తీర్పు
ప్రణయ్ హత్య కేసులో మార్చి 10న (సోమవారం) నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఎనిమిది మందిలో ఏ-1 మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు. ఇక కేసులో ఏ-2 సుభాశ్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితుల్లో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో వేట కొడవళ్లతో ఆయన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
నిందితులు అప్పీల్‌కు వెళ్తారా?
ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలు పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలో బెయిల్ పొందారు. మొత్తానికి ప్రణయ్ కేసుకు ముగింపు వచ్చింది. మరి న్యాయస్థానం ఆదేశాలపై మిగతా నిందితులు పైకోర్టుకు అప్పీల్ చేస్తారా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.