Kalyan Ram New Movie : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లో హిట్లు చాలా తక్కువ. హిట్ అయిన సినిమాలు కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. ‘అతనొక్కడే’ ‘పటాస్’ ‘బింబిసార’ వంటి సినిమాలు కళ్యాణ్ రామ్ కు మార్కెట్ ఏర్పడేలా చేశాయి. అలా అని అవి అతనికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమాలు ఏమీ కావు.అతనిపై దాదాపు రూ.50 కోట్లు పెట్టి చేసిన ‘డెవిల్’ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. నష్టాలు మిగిల్చింది. సో మార్కెట్ పరంగా కళ్యాణ్ రామ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు.
‘అమిగోస్’ తో కూడా అది ప్రూవ్ అయ్యింది. అందుకే అతని ‘బింబిసార 2’ ఇప్పటికీ పట్టాలెక్కలేదు. అలాగే కళ్యాణ్ రామ్ కెరీర్లో 21 వ సినిమాగా ఓ యాక్షన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. దానికి కూడా బడ్జెట్ సమస్యలు వచ్చాయి. విజయశాంతి వంటి భారీ తారాగణం ఉండటం వల్ల ఆ సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది.
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ అనే వర్కింగ్ తో టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ అప్పుడే రూ.60 కోట్లు దాటేసిందట. అందుకే ఆ సినిమా కూడా ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే కళ్యాణ్ రామ్ మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది అని తెలియజేయడానికి. ఇలాంటి టైంలో కళ్యాణ్ రామ్ తో రూ.125 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట ఓ బడా నిర్మాత.
ఆ బడా నిర్మాత పేరు ఇంకా బయటకి రాలేదు కానీ… అది రాజమౌళి- మహేష్..ల సినిమాలా భారీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామా అని తెలుస్తుంది. మహేష్ – రాజమౌళి సినిమాకంటే ముందే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా పురాణాల నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. సుకుమార్ శిష్యుడు పలనాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ‘కరెంట్’ ‘కుమారి 21 ఎఫ్’ ’18 పేజెస్’ వంటి సినిమాలతో దర్శకుడిగా పాపులర్ అయ్యాడు పలనాటి సూర్యప్రతాప్. అయితే ఇతనిపై కొరియన్ సినిమాలు కాపీ కొట్టేస్తాడు అనే విమర్శలు కూడా వస్తుంటాయి.
అయితే దర్శకుడిలో ఎంత పెద్ద విషయం ఉన్నా, ఎంత పవర్ఫుల్ కథాంశం ఎంపిక చేసుకున్నా.. కళ్యాణ్ రామ్ పై రూ.125 కోట్ల బడ్జెట్ ఎలా పెడతారు? అంత పెద్ద మొత్తాన్ని ఎలా రికవరీ చేసుకుంటారు? అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అందుకే దీనిని రెండు భాగాలుగా చేస్తారని టాక్ వినిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో సినిమాలకి బడ్జెట్ పెరిగిపోయి, ఫుటేజీ ఎక్కువ వస్తే.. వెంటనే వాటిని 2 పార్టులు చేసేస్తున్నారు. ‘పుష్ప’ విషయంలో జరిగింది ఇదే. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకి కూడా అంతే అని సమాచారం. త్వరలోనే కళ్యాణ్ రామ్ అడ్వెంచరస్ మూవీ గురించి మరిన్ని వివరాలు బయటకి వచ్చే అవకాశం ఉంది.