BigTV English

Hair Growth tips: జుట్టు విపరీతంగా రాలిపోతుందా..? ఆయుర్వేద చిట్కాలతో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టండి

Hair Growth tips: జుట్టు విపరీతంగా రాలిపోతుందా..? ఆయుర్వేద చిట్కాలతో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టండి

Hair Growth tips: హెయిర్ ఫాల్ సమస్య నుంచి తప్పించుకోవడానికి చాలా మంది రకరరాల ప్రయత్నాలు చేస్తారు. ఊడిపోయిన జుట్టు తిరిగి రావాలని ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతారు. ఇవి జుట్టుతో పాటు చర్మంపై చెడు ప్రభావం చూపితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే జుట్టు తిరిగి పెరగడానికి సహజమైన పద్ధతులు పాటించడం మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడేందుకు ఈ ఆయుర్వేద చిట్కాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయట.


భ్రింగ్‌రాజ్ ఆయిల్:
భ్రింగ్‌రాజ్ ఆయిల్ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఊడిపోయిన జుట్టు తిరిగి పెరగడానికి కూడా ఇది తోడ్పడుతుందట. ఈ నూనెను తలకు అప్లై చేసి 15-20 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుందట.

ఉసిరి నూనె:
ఉసిరికాయల ద్వారా తయారు చేసిన నూనెను వాడడం వల్ల జుట్టు బలంగా మారుతుందట. ఇందులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి ఇవ సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉసిరి నూనెతో తలకు మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి పొడిని నీళ్లలో కలిపి ఆ పేస్ట్‌ని జుట్టుకు రాయాలి. అరగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేస్తే జట్టు రాలడం ఆగిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


కరివేపాకు:
అధికంగా జుట్టు రాలుతుంటే కరివేపాకు సహాయం తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులో జుట్టు రాలడాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయట. వేడి చేసిన కొబ్బరి నూనలో కరివేపాకు వేసి, ఆ నూనెను మీ తలకు మసాజ్ చేస్తే జుట్టు స్ట్రాంగ్‌గా మారుతుందట.

పోషకాహారం:
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. విటమిన్-B12, Eతో పాటు ప్రోటీన్స్ లోపం ఏర్పడడం వల్ల కూడా చాలా మందిలో హెయిర్ ఫాల్ సమస్య వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే జుట్టును సంరక్షించే గుడ్లు, పాల ఉత్పత్తులు, పాలకూర, బీన్స్, ఉసిరి వంటి వాటిని ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఉండే బయోటిన్, జింక్, జుట్టు పెరగడానికి సహాయపడతాయి.

ALSO READ: జుట్టు పెరుగుదలకు ఉల్లి మేలు

క్రమం తప్పకుండా తలకు మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ పెరిగి, జుట్టు పెరుగుతుందట. పోషకమైన మసాజ్ కోసం నువ్వుల నూనె లేదా బాదం నూనె వంటి ఆయుర్వేద నూనెలను ఉపయోగించవచ్చు. పడుకునే ముందు 10–15 నిమిషాల పాటు మాడు భాగంలో మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుందట.

నిద్ర లేకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు మాత్రమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అలాగే జుట్టును హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగాలట.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×