BigTV English

Onion Benefits for Hair : జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మేలు

Onion Benefits for Hair : జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మేలు

Onion Benefits for Hair : ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలని కోరుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో కాలుష్యం, జీవనశైలి కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ రసాన్ని మంచిన మందు మరొకటి లేదంటున్నారు వైద్య నిపుణులు. మన ఆరోగ్యానికి ఉల్లిపాయలోని పోషక విలువలు ఎంతో ఉపయోగపడతాయి. కెరాటిన్‌ అనే ప్రొటీన్‌ లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుంది. సల్ఫర్‌ కెరాటిన్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయితే ఉల్లిపాయ రసంలో ఈ కెరాటిన్‌ సంవృద్ధిగా లభిస్తుంది. దీంతో చుండ్రు కూడా తగ్గుతుంది. ఉల్లిపాయ రసం ఊడిపోయిన జుట్టుని మళ్లీ పెంచుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఈ ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు నిదానంగా రాసుకోవాలి. ఐదు నిమిషాల పాటు చేతివేళ్లతో మర్దనా చేసుకోవాలి. తర్వాత పావుగంట పాటు అలా వేదిలేయాలి. తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానకి 2 టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, 2 టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె, 5 చుక్కల టీ ఆయిల్‌ తీసుకోవాలి, వీటిని బాగా కలపాలి. దీన్ని జుట్టుకు పెట్టుకుని తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయడం ద్వారా జుట్టు రాలకుండా ఉంటుంది, అంతేకాకుండా ఒత్తుగా పెరుగుతుంది. వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేయడం మంచిది. కెమికల్స్‌ తక్కువగా ఉండే షాంపులను ఉపయోగించాలి. తడిగా ఉన్న జుట్టును దువ్వకూడదు. ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×