Trisha Vs Nayanthara: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల మధ్య ఈగో క్లాసెస్ మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే ఆ విభేదాలు ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండా చేస్తాయి. ఈ క్రమంలోనే త్రిష, నయనతార మధ్య ఇలాంటి గొడవలే ఉన్నాయని, ఇద్దరు కూడా చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara).. ఈ విషయాలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇక నయనతార మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి అసలు కారణం ఏంటి?అని ఆరా తీస్తున్నారు.
అర్థం లేని విషయాల గురించి స్పందించను – నయనతార
సాధారణంగా నయనతార సోషల్ మీడియాలో వచ్చే వార్తలు గురించి పెద్దగా స్పందించదు. కానీ ఈ మధ్యకాలంలో నిత్యం ఏదో ఒక విషయంలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార మాట్లాడుతూ.. “నేను అర్థం లేని విషయాల గురించి స్పందించను. ఒక సినిమా విడుదల కానప్పుడు లేదా ఎవరైనా నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే తప్ప నేను మీడియాతో మాట్లాడను” అంటూ మీడియాలో వచ్చిన వార్తలకు నయనతార స్పందించింది.
త్రిష తో గొడవలపై క్లారిటీ ఇచ్చిన నయనతార..
అలాగే త్రిషతో గొడవలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. త్రిష తో మీ అనుబంధం ఎట్టిది? అని ప్రశ్నించగా..” మేము మంచి స్నేహితులం కాదు అని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే స్నేహితులు అనే పదం చాలా గొప్పది. అందుకే నేను మేము మంచి స్నేహితులం అని అబద్ధం చెప్పలేను. పెద్దగా నేను ఆమెతో మాట్లాడను. అయితే నిజానికి మాకు ఏం విభేదాలు లేవు. అలా అని ఉన్న సమస్యలను వెళ్లిన తర్వాత పరిష్కరించుకోవాలని కూడా అనుకోవట్లేదు. ముఖ్యంగా తనతో మాట్లాడాలని నేను అసలు అనుకోవడం లేదు” అంటూ సమాధానం చెప్పింది నయనతార. ఇక ప్రస్తుతం నయనతార చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇద్దరి మధ్య మాటలు లేవు అని స్పష్టంగా చెప్పేసింది నయనతార. కానీ వీరిద్దరి మధ్య విభేదాలకు గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియదనే చెప్పాలి. ఇక నయనతార విషయానికి వస్తే.. గతంలో ‘మూకుత్తి అమ్మన్’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు ఈ సినిమా పూజా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది నయనతార. ఈ సినిమా సీక్వెల్ కు సుందర్ సి (Sundar C) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక త్రిష విషయానికి వస్తే.. ప్రస్తుతం సూర్య (Suriya) సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అంతేకాదు చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇద్దరు కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా..ఇప్పటికీ అదే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
Suriya – Jyothika: సూర్య ఇంట్లో స్టార్ సెలబ్రిటీస్ సందడి.. ఏమై ఉంటుంది..?