BigTV English

Mullapudi Brahmanandam: ఇండస్ట్రీలో విషాదం.. అల్లరి నరేష్ నిర్మాత మృతి..!

Mullapudi Brahmanandam: ఇండస్ట్రీలో విషాదం.. అల్లరి నరేష్ నిర్మాత మృతి..!

Mullapudi Brahmanandam: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సినీ సెలెబ్రిటీలను ఇటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరు వృద్ధాప్య కారణాల వల్ల, ఇతర అనారోగ్య సమస్యల కారణాల వల్ల మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత స్వర్గస్తులయ్యారు. తెలుగులో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ముళ్ళపూడి బ్రహ్మానందం(Mullapudi Brahmanandam) 68 సంవత్సరాల వయసులో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఆదివారం రోజు రాత్రి 10 గంటల సమయంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో దాదాపు వారం రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అయితే పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఇక ముళ్ళపూడి బ్రహ్మానందం మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు , ఆయనతో పనిచేసిన సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆయన ఇంటికి చేరుకొని ఆయన పార్తివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.


ఈవీవీ సత్యనారాయణకు స్వయానా బావమరిది..

ముళ్ళపూడి బ్రహ్మానందం కొడుకు సతీష్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడట. ఇక తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక ఈయనకు భార్య మంగాయమ్మ, కొడుకు సతీష్ , కూతురు మాధవి ఉన్నారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ (EVV Sathyanarayana) కు సొంత బావమరిది అవుతారట. సత్యనారాయణ చెల్లెలిని ముళ్ళపూడి బ్రహ్మానందం పెళ్లి చేసుకున్నారు. కాగా అల్లరి నరేష్ (Allari Naresh) తో ముళ్ళపూడి బ్రహ్మానందం ‘నేను’ అనే సినిమాను నిర్మించారు.


 Trisha Vs Nayanthara: ఏంటీ నిజంగానే త్రిష – నయనతార మధ్య శత్రుత్వం ఉందా..?

ముళ్ళపూడి బ్రహ్మానందం కెరియర్..

ముళ్ళపూడి బ్రహ్మానందం ప్రముఖ దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ సోదరిని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీపై మక్కువ పెరిగిందట. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మాతగా ఇండస్ట్రీకి తొలిసారి అడుగులు వేశారు అలా ‘అల్లుడుగారు వచ్చారు’ సినిమాతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈయన.. ఆ తర్వాత ‘మనోహరం’, ‘ఓ చిన్నదాన’, ‘నేను’ లాంటి సినిమాలను నిర్మించారు. ఇలా గొప్ప చిత్రాలను మనకు అందించి , నేడు మన మధ్య లేకపోవడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×