Ice Cream: వేసవిలో చల్లని ఐస్ క్రీం తింటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఐస్ క్రీం తినడానికి చాలా ఇష్టపడతారు. కానీ ఐస్ క్రీం తీపి, చల్లదనం వెనుక మీ ఆరోగ్యానికి నెమ్మదిగా హాని కలిగించే ప్రమాదం పొంచి ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? వేసవిలో ఐస్ క్రీం తినడం వల్ల ఉపశమనం లభించినట్లే.. అది మీ శరీరానికి కూడా ప్రమాదాలను కలిగిస్తుంది. వేసవిలో చల్లబరచడానికి నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసం వంటివి తీసుకోడం చాలా మంచిది. అప్పుడప్పుడు ఐస్ క్రీం తినడం మంచిదే కానీ.. అది అలవాటుగా మార్చుకోకండి. ఆరోగ్యమే మీ అతిపెద్ద ఆస్తి. రుచి కోసం వెతుకులాటలో దానిని కోల్పోకండి. తరచుగా ఐస్ క్రీం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి, టాన్సిల్ సమస్యలు:
వేడిగా ఉన్న శరీరంలోకి అకస్మాత్తుగా చల్లగా ఉన్న వస్తువును తినడం వల్ల గొంతుపై ప్రభావం పడుతుంది. దీని వల్ల ముఖ్యంగా పిల్లలలో నొప్పి, వాపు, టాన్సిల్ పెరుగుతాయి. అంతే కాకుండా జలుబు వంటి సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం:
ఐస్ క్రీం తరచుగా తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చల్లటి వస్తువులు శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
బరువు పెరిగే ప్రమాదం:
ఐస్ క్రీం చక్కెర, కొవ్వు, కేలరీలతో నిండి ఉంటుంది. క్రమం తప్పకుండా తీనిని తీసుకుంటే.. అది వేగంగా బరువు పెరగడానికి కారణమవుతుంది. అంతే కాకుండా ఊబకాయం వంటి అనేక వ్యాధులకు కారణం అవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం:
డయాబెటిస్ ఉన్నవారు ఐస్ క్రీం తినడం అంత మంచిది కాదు. దీనిలో ఉండే అధిక చక్కెర శాతం రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది.
దంతాల సున్నితత్వం:
చాలా చల్లగా ఉండే ఐస్ క్రీం తినడం వల్ల దంతాల సున్నితత్వం పెరుగుతుంది. ఇది కాకుండా.. ఐస్ క్రీంలో ఉండే చక్కెర దంతాలలో కావిటీస్ , ఇతర సమస్యలను కలిగిస్తుంది.
Also Read: సమ్మర్‌లో ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? జాగ్రత్త !
జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం:
వేసవిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అకస్మాత్తుగా చల్లని ఆహారం తీసుకోవడం జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
చర్మంపై ప్రభావం:
ఐస్ క్రీం వంటి అధిక చక్కెర ఉండే పదార్థాలు చర్మంపై దద్దుర్లు, మొటిమలు, జిడ్డును కలిగిస్తాయి. వేసవిలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. తరచుగా ఐస్ క్రీం తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.