Delivery Boy Murder By Girlfriend Relatives| ప్రేమ అతిగా మారినా ప్రమాదమే అని ఇటీవల జరిగిన ఘటనతో నిరూపితమైంది. ఒక 19 ఏళ్ల డెలివరీ బాయ్‌ని అయిదుగురు యువకులు కిడ్నాప్ చేసి చితకబాదారు. ఆ గాయాల కారణంగా అతను చనిపోయాడు. ఇది జరిగిన వెంటనే ఆ కిడ్నాపర్లు శవాన్ని నిర్మానుష ప్రదేశంలో విసిరేశారు. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని దేవనహల్లి పట్టణంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. దేవనహల్లి పట్టణం ప్రశాంత్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రీతం అనే 19 ఏళ్ల కుర్రాడు ఒక గ్రాసరీ కంపెనీ ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రీతం గత కొంతకాలంగా 21 ఏళ్ల యువతితో లవ్ చేస్తున్నాడు. అయితే ఆ యువతి ఆయుర్వేదలో డిగ్రీ పూర్తిచేసింది. ఆ తరువాత ఆమె ఒక డెలివరీ బాయ్ అయిన ప్రీతంతో తనకు సరిపడదని భావించి అతడితో దూరంగా ఉండేది. కానీ ప్రీతం మాత్రం ఆమెను గాఢంగా ప్రేమించాడు. అందుకే ఆమె వెంట పడేవాడు. తనతో బ్రేకప్ చేసుకోవద్దని ఆమెతో చెప్పేవాడు. అయితే ఆ యువతి ఇదంతా వేధింపులుగా భావించింది. అందుకే తన కుటుంబ సభ్యులకు తన సమస్య గురించి చెప్పేసింది.
ఆ యువతి అన్న శివ కుమార్, బావ శ్రీకాంత్.. ప్రీతంని కలిసేందుకు అతను డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి కలిశారు. అక్కడ అందరి ముందు అతడిని బెదిరించారు. కానీ ఆ తరువాత కూడా ప్రీతం.. తన ప్రియురాలిని వెంబడిస్తూనే ఉన్నాడు.
అందుకే శ్రీకాంత్, శివకుమార్ తమ ముగ్గురు స్నేహితులు అయిన చరణ్, సంజయ్, కౌషిక్ సాయంతో ఒక వ్యాన్ తీసుకొని వెళ్లి ప్రీతంని పనిచేస్తున్న ఆఫీసు బయట అతడిని కొట్టారు. ఆ తరువాత అతడిని బలవంతంగా వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్లారు. ఇదంతా ప్రీతంతో కలిసి పనిచేసే ఇతరులు కూడా చూశారు. ఈ ఘటన రాత్రి 10.30 గంటలకు జరిగింది. ఆ తరువాత వ్యాన్ లోనే దేవనహల్లి పట్టణం బైపాస్ లోకి వ్యాన్ తీసుకెళ్లి అక్కడ ప్రీతంని చావబాదారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. ఈ గాయాలకు ప్రీతం స్పృహ కోల్పోయాడు. ఎంత సేపటికీ ప్రీతం స్పృహలోకి రాకపోవడంతో భయపడిపోయిన శ్రీకాంత్ అతని స్నేహితులు ప్రీతం చనిపోయాడని తెలుసుకున్నారు. అందుకే సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శవాన్ని పడేసి అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: హోటల్ గదిలో బిజినెస్‌మ్యాన్ శవం.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన మహిళ
మరోవైపు రాత్రంగా ప్రీతం ఇంటికి రాలేదని ఉదయం 6.30 గంటలకు అతని తండ్రి రామచంద్ర ఆఫీసుకు వచ్చాడు. అప్పుడు ఆయనకు రాత్రి ప్రీతంని కొందరు వ్యాన్‌లోకి బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారు. దీంతో రామచంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అంతలోనే పోలీసులకు గుర్తు తెలియని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో లభించిందని సమాచారం అందింది.
పోలీసులు ప్రీతం మృతదేహాన్ని చూసి ముందుగా గుర్తించ లేకపోయారు. అతడి ముఖంపై ఉన్న గాయాల కారణంగా గుర్తుపట్టడం కష్టంగా మారింది. కానీ ప్రీతం తండ్రి రామచంద్ర తన కొడుకు శవాన్ని గుర్తపట్టాడు. దీంత పోలీసులు వెంటనే నిందితులు అయిన శ్రీకాంత్, శివకుమార్, సంజయ్, కౌషిక్, చరణ్ లను అదుపులోకి తీసుకున్నారు. ప్రీతంపై దాడి చేసిన అయిదుగురు నిందితులందరూ లేబర్ పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని.. యువతిని వేధిస్తున్నాడనే కారణంగానే ప్రీతంని బెదిరించడానికి కొట్టారని పోలీసులు తెలిపారు. అయితే ఆ గాయాల కారణంగా ప్రీతం చనిపోవడంతో ఇప్పుడు అది హత్య కేసుగా మారింది.