Sleep Apnea: మనిషి పడుకున్న సమయంలో ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడం ఆగిపోతే నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. స్లీప్ అప్నియా అనే ఒక సిండ్రోమ్ వస్తే ఇలాగే జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు శ్వాసకు పూర్తిగా అంతరాయాలు కలగడం లేదా ఊపిరి తీసుకోలేక పోవడం వల్ల ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉందట.
స్లీప్ ఆప్నీయా ఎందుకు వస్తుంది..?
ఊబకాయం సమస్య వల్లే ఎక్కువ మందిలో స్లీప్ ఆప్నీయా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెడ చుట్టూ కొవ్వు పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందట. మహిళల్లో అయితే మెనోపాజ్ తర్వాత ఈ సమస్య వస్తుంది.
నిద్రలో గురక పెట్టే అలవాటు వల్ల కూడా స్లీప్ ఆప్నీయా వచ్చే ఛాన్స్ ఉందట. మరికొందరిలో నిద్రలేమి, ఒత్తిడి వల్ల శ్వాసక్రియపై చెడు ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. మద్యం తీసుకోవడం, స్మోకింగ్, స్లీపింగ్ టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా స్లీప్ ఆప్నీయా సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందట.
స్లీప్ ఆప్నీయా సైడ్ ఎఫెక్ట్స్:
స్లీప్ ఆప్నీయా కారణంగా ఆరోగ్యంపై అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే స్లీప్ ఆప్నీయాతో ఇబ్బంది పడుతున్న వారిలో ఆవేశం, మానసిక ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉందట. మరికొందరిలో గుండె జబ్బులు, స్ట్రోక్, బీపీ, డయాబెటిస్ వంటివి రావొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
ALSO READ: వడదెబ్బ తగిలితే ముందుగా చేయాల్సిన పనులు
ట్రీట్‌మెంట్:
స్లీప్ ఆప్నీయాను తగ్గించేందుకు CPAP అనే టెక్నిక్‌ని వాడతారట. నిద్రపోతున్న సమయంలో ముక్కు ద్వారా గాలిని పీల్చుకునేందుకు ఇది హెల్ప్ చేస్తుందట.
అంతేకాకుండా డైలీ లైఫ్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం ద్వారా ఈ సమస్య నుంచి బచట పడొచ్చట. అలాగే మద్యం తీసుకోవడం తగ్గించడం, సమయానికి నిద్రపోవడం వల్ల కూడా స్లీప్ ఆప్నీయా ప్రభావాన్ని తగ్గించుకోవచ్చట.