E-Paper
Advertisement

Diabetes: అధిక చక్కెరతో ఈ 5 అవయవాలు రిస్క్‌లో ఉన్నట్టే! మధుమేహాన్ని నియంత్రించే సులువైన మార్గాలు

Diabetes: అధిక చక్కెరతో ఈ 5 అవయవాలు రిస్క్‌లో ఉన్నట్టే! మధుమేహాన్ని నియంత్రించే సులువైన మార్గాలు
Advertisement

Diabetes: ఈ రోజుల్లో డయాబెటిస్ తీవ్రమైన వ్యాధిగా మారుతోంది. ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ, ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి. అదుపు చేయకపోతే.. అధిక చక్కెర స్థాయిలు అనేక ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి. నియంత్రణ లేని చక్కెర స్థాయి క్రమంగా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక రక్త చక్కెర వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే ఐదు శరీర భాగాలను, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సులభమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వల్ల ప్రభావితం అయ్యే 5 భాగాలు:

Advertisement

కళ్ళు:
అధిక రక్త చక్కెర వల్ల కళ్ళు తీవ్రంగా ప్రభావితమవుతాయి. షురగ్ ఎక్కువైతే కళ్ళలోని నరాలను బలహీనపరుస్తుంది. దీని వల్ల దృష్టి మసకబారడం, కంటి చికాకు, డయాబెటిక్ రెటినోపతి ప్రమాదం పెరుగుతుంది. సకాలంలో నియంత్రించకపోతే.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

కిడ్నీలకు నష్టం:
డయాబెటిస్ నేరుగా కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తుంది. అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని బలహీన పరుస్తాయి. దీని వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా డయాబెటిక్ నెఫ్రోపతి ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రారంభంలో.. ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ సమస్య క్రమంగా తీవ్రంగా మారుతుంది.

Advertisement

గుండె ఆరోగ్యంపై ప్రభావాలు:
అధిక రక్తంలో చక్కెర గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుంది. ఇది రక్త నాళాలు గట్టిపడటానికి కారణమవుతుంది.అంతే కాకుండా అధిక రక్తపోటు, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

నరాలకు నష్టం:
దీర్ఘకాలికంగా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి, మంట వస్తుంది. కొన్నిసార్లు.. నొప్పి చాలా తీవ్రంగా మారుతుంది. నడవడం కూడా కష్టంగా మారుతుంది.

Also Read: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా ? అల్లం ఇలా వాడితే క్షణాల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్

పాదాలు, చర్మంపై ప్రభావాలు:
డయాబెటిస్ కాళ్ళలోని నరాలు, రక్త ప్రసరణను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. చిన్న గాయాలు లేదా గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా చర్మం పొడిగా మారుతుంది. ఇది తరచుగా దురద లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కూడా కారణం అవుతుంది.

ఈ పద్ధతులతో మధుమేహాన్ని అదుపులో ఉంచండి:
మధుమేహాన్ని నియంత్రించడానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలతో సహా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవండి లేదా వ్యాయామం చేయండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అంతే కాకుండా తగినంత నిద్ర పోండి మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేయండి. డాక్టర్ ని సంప్రదించకుండా మందులు తీసుకోవడం ఆపకండి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×