E-Paper
Advertisement

Rayalaseema lift irrigation: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం రిప్లై

Rayalaseema lift irrigation: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం రిప్లై
Advertisement

Rayalaseema lift irrigation: తెలంగాణలో రాజకీయాలు ఏపీకి పాకాయి. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ విషయంలో సీఎం వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఇంతకీ సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారు? కాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఎం రేవంత్ కామెంట్స్

Advertisement

తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై శనివారం సుధీర్ఘ చర్చ జరిగింది. కృష్ణా-గోదావరి జలాలపై మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది ఏపీ ప్రభుత్వం. తన విన్నపం మేరకు సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని చేసిన వ్యాఖ్యలు అసత్యమని చెప్పింది. మాజీ సీఎం జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ చేపట్టింది.

Advertisement

రిప్లై ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, అసలు మేటరేంటి?

రోజుకు మూడు టీఎంసీల నీరు అని చెబుతూ భారీ ప్రకటనలు ఇచ్చింది తెలిపింది. అనుమతులు లేకుండా జగన్ హయాంలో పనులు చేపట్టారని వివరించింది. జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై న్యాయస్థానంలో కేసులు వేసింది అప్పటి తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం, ఎన్జీటీతో సహా పలుస్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులతో విచారించిన న్యాయస్థానం అనుమతులు లేని కారణంగా పనులను నిలిపివేసినట్టు క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు 2020లో ఎన్టీటీ, కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిందని ప్రస్తావించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆ ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపి వేసిందనట్టు తెలిపింది.

ALSO READ:  ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్

శనివారం అసెంబ్లీలో నదీ జలాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి కేసీఆర్‌ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారని, తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపించానని అన్నారు. ఆ పనులు ఆగాయో లేదో తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని పంపించాలన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన తాను.. ఆ నాయకత్వాన్ని, ఆ పార్టీని వదిలిపెట్టానని అన్నారు. అలాంటిది తెలంగాణకు అన్యాయం చేస్తానా? మొదట తనకు తెలంగాణ అని, ఆ తర్వాతే పార్టీ అని వ్యాఖ్యానించారు. తనలాంటి వాళ్లు తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×