BigTV English

Mad love: మగవారు ఏ అమ్మాయినైనా ఎక్కువ ఇష్టపడితే వారు చేసే కొన్ని వెర్రి పనులు ఇవే

Mad love: మగవారు ఏ అమ్మాయినైనా ఎక్కువ ఇష్టపడితే వారు చేసే కొన్ని వెర్రి పనులు ఇవే

స్త్రీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కానీ పురుషుల భావాలను మాత్రం త్వరగా అర్థం చేసుకోవచ్చని చెబుతారు మానసిక నిపుణులు. పురుషులు తమ మనసులోని భావాలను దాచుకోలేరు. వారికి ఎవరి పైనైనా ఇష్టం వస్తే అది కొన్ని పద్ధతుల్లో బయటికి చూపిస్తారు. అలా ఇష్టపడితే కొన్ని తెలివి తక్కువ పనులు కూడా చేసి దొరికిపోతూ ఉంటారు. ఏ మగవాడైనా మీ చుట్టూ కొన్ని వెకిలి పనులు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తికి మీరంటే ఎంతో ఇష్టమని అర్థం. ఆ పనులేంటో తెలుసుకోండి.


ఇష్టాలన్నీ మార్చుకుంటాడు
మగవాడు ఒక అమ్మాయిని ఇష్టపడితే అతడు తనలో అన్నింటినీ మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు. తనకు కాఫీ ఇష్టమైనా, ఆ అమ్మాయి కోసం టీ తాగడం మొదలు పెడతాడు. ఏదైనా బంధం నిజమైనదిగా ఉండాలని భావిస్తాడు. అందుకే ఆమె కళ్ళల్లో పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఆమె ఇబ్బంది పడుతున్నా…
కొంతమంది పురుషులు తాము ఇష్టపడే స్త్రీ కోసం చాలా ఫ్యాన్సీ పనులు చేస్తూ ఉంటారు. ఇవి ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తున్నా కూడా ఆపరు. ఆమెనే తదేకంగా చూడడం, ఆమెకు ఇబ్బంది కలుగుతున్నా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం చేస్తారు. సంబంధం లేకుండా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఆమెకు కనిపించేలా కూర్చోవడం, అవసరం ఉన్నా లేకపోయినా ఆమె ఉన్నచోటికి పదేపదే వెళ్లి రావడం వంటివి చేస్తారు. ఇలా ఒక పురుషుడు చేస్తూ ఉంటే అతడికి ఆమె అంటే ఎంతో ఇష్టమని అర్థం చేసుకోవాలి.


ఏ పురుషుడైన మీ పట్ల ఆసక్తి కలిగి ఉంటే అతను తన సొంత ఆసక్తులను మరిచిపోతాడు. తన సొంత అవసరాలను కూడా పట్టించుకోడు. ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో ఆ అభిరుచులని అలవరుచుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం, గౌరవించడం వంటివి చేస్తూ ఉంటాడు. ఇష్టమున్నా లేకపోయినా ఆమె ఏ ఆహారాన్ని ఇష్టపడుతుందో అదే ఆహారాన్ని తింటూ ఉంటాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి తెలిసేలా చేస్తాడు.

విపరీతమైన పొగడ్తలు
ఆ అమ్మాయిని వీలైనప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇన్ డైరెక్ట్ గా ఆ అమ్మాయికి తెలిసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆమె వేసుకున్న డ్రెస్ నుంచి ఆమె చేసే అన్ని పనులను అలా పొగుడుతూనే ఉంటాడు. ఇవి ఒక్కొక్కసారి ఓవరాక్షన్‌లా అనిపిస్తాయి.ఆమెకు ఇబ్బందిగా కూడా అనిపిస్తాయి. అయినా సరే… ఆ అమ్మాయిని దృష్టిలో పడేందుకు ఇవన్నీ చేస్తాడు. ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఆమెను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తాడు.

సోషల్ మీడియాలో
ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ ఖాతాలు ఉన్నాయి. ఇన్ స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్ వరకు ఆ అమ్మాయి ఖాతాను ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. ఆమె పెట్టిన ప్రతి ఫోటోకు, ప్రతి పోస్టుకు లైక్ కొడతాడు. లవ్ సింబల్స్ ఇవ్వడం వంటివి చేస్తాడు. తన ప్రేమను ఏదోరకంగా బయట పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అందరిలో తన ప్రేమను బయటపడేలా చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో మాత్రం పట్టించుకోడు. అతనికి కావాల్సిందల్లా ఆమె దృష్టిలో అతను పడడమే. ఇందుకోసం తల తిక్క పనులు ఎన్నో చేస్తూ ఉంటాడు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×