BigTV English

Bhairavam: ఒక తమిళ్ అందం.. ఒక తెలుగందం.. అదిరిందయ్యా భైరవం

Bhairavam: ఒక తమిళ్ అందం.. ఒక తెలుగందం.. అదిరిందయ్యా భైరవం

Bhairavam: రాకింగ్ స్టార్  మంచు మనోజ్.. గత కొంతకాలంగా  గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫిల్ చేసే పనిలో పడ్డాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి హీరోగా కాదు.. కాస్త రూట్ మార్చి విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న మిరాయ్ లో మంచు మనోజ్ విలన్  గా నటిస్తున్న విషయం తెల్సిందే.


ఇక ఇది కాకుండా మరో సినిమాలో కూడా ఈ కుర్ర హీరో నెగెటివ్ షేడ్స్ లోనే దర్శనమివ్వబోతున్నాడట. ఆ  సినిమానే భైరవం. మల్టీస్టారర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ కుర్ర హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్  నటిస్తున్నారు.

Mokshagna Debut Movie: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మరో ఇద్దరు స్టార్ కిడ్స్.. సినిమాలో ఊహించని సర్‌ప్రైజ్


తమిళ్ లో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్ గా భైరవం తెరకెక్కుతుంది. నాంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేడల.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ ముగ్గురు హీరోల లుక్ రిలీజ్ అయ్యి మంచి హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇప్పటికే మరో హీరోయిన్ అదితి శంకర్ ను కూడా పరిచయం చేశారు.

తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ ను మేకర్స్ పరిచయం చేశారు. అచ్చ తెలుగందం ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. బస్ స్టాప్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన  ఈ తెలంగాణ పిల్ల .. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందరి గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

Unstoppable With NBK: ఒక్కసారైనా ఎన్టీఆర్ గురించి అడగాలనిపించలేదా బాలయ్య.. ?

జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఇలాంటి సినిమాల్లో కుర్ర హీరోలతో జతకట్టి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు భైరవం సినిమాలో నీలిమ అనే పాత్రలో ఆమె కనిపించబోతుందని మేకర్స్ తెలిపారు.

అచ్చ తెలుగు ఆడపిల్లగా.. తులసికోటకు పూజా చేస్తూ.. ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జాంబీ రెడ్డి సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత మరో హిట్ ను సొంతం చేసుకోలేదు. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×