ఇప్పటికీ ఎన్నోచోట్ల ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అత్త మామలతోనే జీవిస్తున్న ఒక కోడలు తన నిజ జీవితంలో జరిగిన సంఘటనను గురించి మనతో పంచుకుంది. అలాగే మానసిక వైద్యుల సలహాను కూడా కోరింది.
ప్రశ్న: ఈ కాలంలో జాయింట్ ఫ్యామిలీల్లో కొనసాగడం చాలా కష్టం. కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా అత్తమామలు నన్ను బాగా చూసుకుంటారు. నా భర్త కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. మా మామగారిని నేను నా సొంత తండ్రిలాగే చూసుకుంటాను. మా అత్తయ్య కూడా అంతే… తన కూతురులా నన్ను చూసుకుంటుంది. ఏడు సంవత్సరాలుగా నేను వీళ్ళతో కలిసి జీవిస్తున్నాను. అయితే ఎప్పుడూ నాకు మా అత్తమామలలో ఎలాంటి చెడు గుణాలు కనిపించలేదు. కానీ ఈ మధ్యనే నాకు ఒక విషయం తెలిసింది. మా మామయ్యగారు మా అత్తయ్యను మోసం చేస్తున్నారు. ఆయన వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు.
నాకు ఆ విషయం తెలిశాక చాలా ఆందోళనగా అనిపిస్తుంది. అది నిజమో కాదో కళ్లారా చూసి నిర్ధారించుకున్నాను. ఇది మా అత్తయ్య గారికి చెబితే ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయం వేస్తోంది. అలా అని చెప్పకుండా దాస్తే ఆ సంబంధం ఎంతవరకు వెళుతుందో.. ఎన్ని గొడవలు అవుతాయో అని భయంగా ఉంది. నా భర్తకు చెప్పినా కూడా ఇంట్లో పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది. నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. మా మామయ్య గారి విషయాన్ని మా అత్తయ్యతో, మా భర్తతో ప్రశాంతంగా ఇంటి వాతావరణం చెడిపోకుండా ఎలా చెప్పాలో తెలియడం లేదు. దయచేసి సహాయం చేయండి.
జవాబు: మీరు ఉన్న పరిస్థితి నిజంగా చాలా క్లిష్టమైనది. అంతేకాదు ఎంతో సున్నితమైన స్థితి కూడా. అందమైన కుటుంబంలో ఉన్న మీరు ఒక సునామీ లాంటి వార్తను మీ గుండెల్లో దాచుకున్నారు. దీన్ని చెబితే మీ అత్త, మీ భర్త కూడా బాధపడతారు. ఇంట్లో గొడవలు కూడా కావచ్చు. చివరికి మీ అత్త మామయ్య విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇవన్నీ ఆలోచించే మీరు ఆ విషయాన్ని మీ గుండెల్లోనే పెట్టుకున్నారు. ఇలాంటి కోడళ్ళు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం. అయితే మీరు కచ్చితంగా ఈ విషయాన్ని ఎక్కువ కాలం దాయలేరు. ఏదో ఒక రకంగా అది బయటపడుతుంది. మీకు తెలిసి కూడా మీ అత్తయ్యకు, భర్తకు చెప్పకుండా మోసం చేసే కన్నా వారికి మీరు ఈ విషయాన్ని చెప్పడం చాలా ఉత్తమం.
మీ మామయ్య విషయానని ఎలాంటి గొడవ కాకుండా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి ముందుగా మీరు మీ ఇంట్లో ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా అవి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ భర్తను ముందుగా సిద్ధం చేయండి. ఆయనతో మొదట ఈ విషయాన్ని చెప్పండి. అది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు చెప్పండి. ఏ రోజైనా మీ అత్త మామ ఇంట్లోంచి బయటికి వెళ్లినప్పుడు మీ భర్తతో ఈ విషయాన్ని షేర్ చేయండి.
Also Read: బాయ్స్ బెడ్ మీద రెచ్చిపోవాలా? ఈ దేశీ ఫుడ్స్ ట్రై చేయండి!
అత్తయ్య ఆరోగ్య పరిస్థితి చెడిపోకుండా ఎలా చెప్పాలో మీ భర్త సాయాన్ని కోరండి. వీలైతే మానసిక వైద్యుల వద్దకు మీ కుటుంబమంతా వెళ్లి ఈ విషయాన్ని చర్చించండి. ముందుగా వైద్యులతో మీరు, మీ భర్త మాట్లాడి… ఈ విషయాన్ని మీ అత్తకు జాగ్రత్తగా తెలియజేయమని కోరండి. అలాగే మీ మామ గారికి కూడా కౌన్సిలింగ్ ఇమ్మని చెప్పండి. ఇది భావోద్వేగాల సమస్య. ముప్పై ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉన్న ఒక జంట మధ్యలోకి మరొక వ్యక్తి ఉందని తెలిస్తే ఆ మనసు తట్టుకోవడం కష్టమే. కానీ ఇలాంటివి ఎక్కువ కాలం దాస్తే ప్రమాదకరం. వీలైనంత త్వరగా మీ భర్తకు మొదట విషయాన్ని తెలియజేయండి