BigTV English

Taj Mahal: తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలు నిండి ఉంటాయి, ఎందుకో తెలుసా?

Taj Mahal: తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలు నిండి ఉంటాయి, ఎందుకో తెలుసా?

మనదేశంలో చెప్పుకోదగ్గ అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో తాజ్ మహల్ ఒకటి. దీనిని చూసేందుకు కేవలం మనదేశంలోని నలుమూలల నుంచే కాదు విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తూనే ఉంటారు. తాజ్ మహల్‌ను నిజమైన ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. చక్రవర్తి షాజహాన్ తన భార్య బేగం ముంతాజ్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు.


తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలు
ఈ పాలరాతి కట్టడాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అయితే ఇప్పుడు ఎవరైనా కూడా తాజ్ మహల్ చూడడానికి వెళితే దాని చుట్టూ ఉన్న పరిసరాలను చూడండి. తులసి మొక్కలతో నిండి ఉంటాయి. ఇలా తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎందుకు అంతలా పెంచుతున్నారో ఎప్పుడైనా తెలుసుకున్నారా?

తులసి మొక్కలే ఎందుకు?
తులసి మొక్కలు ఔషధ గుణాలు కలిగినవి. ప్రతిరోజూ దాదాపు 20 గంటల పాటు ఆక్సిజన్ ను విడుదల చేస్తూనే ఉంటాయి. ఇక మిగతా నాలుగు గంటలు ఓజోన్ వాయువును విడుదల చేస్తాయి. ఇక తులసి మొక్క తన చుట్టూ ఉన్న 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. దీనివల్లే తులసి ఉన్నచోట కీటకాలు కనిపించవు. అందుకే తాజ్ మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎక్కువగా నాటారు. తులసి మొక్కల వల్లే తాజ్ మహల్ పై క్రిమి కీటకాలు చేరకుండా రక్షణ లభిస్తోంది. తులసి నుండి వెలువడే ఓజోన్ వాయువు.. సూర్యుని హానికరమైన కిరణాల నుండి తాజ్ మహల్‌ను రక్షిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.


తులసి మొక్కలు నాటడం వల్ల ఎటువంటి సూక్ష్మక్రిములు, కీటకాలు తాజమహల్ దగ్గరికి రావు. దీనివల్ల తాజ్ మహల్ గోడలు, నేల రెండూ పరిశుభ్రంగా ఉంటాయి. అంతేకాదు తాజ్ మహల్ చుట్టూ ఉన్న కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. గాలి స్వచ్ఛంగా మారుతుంది. దానివల్ల ఈ కట్టడం ఎక్కువ కాలం పాటు నిలిచి ఉండే అవకాశం ఉంది.

కాలుష్య నియంత్రణలో
తాజ్ మహల్ చుట్టూ ఉన్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ముఖ్యంగా తెలిసి మొక్కలను నాటారని చెప్పుకుంటారు. ఇప్పుడే కాదు షాజహాన్ ఈ తాజ్ మహల్‌ని కట్టినప్పటి నుంచి దాని చుట్టూ తులసి మొక్కలను నాటాడని చెబుతారు. తులసిలో ఔషధ గుణాలు ఎక్కువ. మనకు కూడా తులసి ఆకులను నమ్మడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు నమిలి మింగేయండి చాలు. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి ఆకుల్లో విటమిన్ సి, అలాగే యూజినాల్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు రోగనిరోధక శక్తికి మద్దతు ఇచ్చేందుకు ఎంతో సహాయపడతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి.

తులసి మొక్కకు డిటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువ. కాబట్టి శరీరంలో ఉన్న విషాలను అదనపు నీటిని మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపించేస్తుంది. దీని వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రక్తం శుద్ధి చెందుతుంది. చర్మం స్పష్టంగా మెరుపును సంతరించుకుంటుంది.

ప్రతిరోజు రెండు తులసి ఆకులను ఖాళీ పొట్టతో తిని చూడండి. మీ జీర్ణాశయంలో హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ఆహారంలోని పోషకాలను శరీరం పూర్తిగా శోషించుకుంటుంది. జీర్ణక్రియ కూడా సులభంగా మారుతుంది. పేగు పొరలను కాపాడే శక్తి కూడా దీనికి ఉంది. అలాగే కడుపుబ్బరం రాకుండా అడ్డుకుంటుంది.

కొన్ని అధ్యయనాలు ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు తులసి ఆకుల రసాన్ని లేదా తులసి ఆకులను ప్రతిరోజు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోకుండా అడ్డుకుంటుంది. కాబట్టి డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారు కచ్చితంగా తులసి ఆకులను ఆహారంలో భాగం చేసేందుకు ప్రయత్నించాలి.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×