Peddi Film:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఉప్పెన’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న బుచ్చి బాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘ పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ (Ram Charan) కు జోడిగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
పెద్ది సినిమా నుండి క్రేజీ అప్డేట్..
ఒకవైపు షూటింగ్ జరుగుతూ ఉండగానే మరొకవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా భారీ ధరకు కొనుగోలు చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దాదాపు రూ.105 కోట్లకు అన్ని భాషల్లో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమధ్య ఈ సినిమా నుండి రోజుకొక పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు మరో సాలిడ్ అప్డేట్ వదిలారు పెద్ది మేకర్స్. ఇందులో క్రేజీ స్టార్స్ నటిస్తున్నట్లు గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓటీటీ సెన్సేషన్ మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా నటుడు దివ్యేందు శర్మ(Divyendu Sharma) కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయారు.
మీర్జాపూర్ నటుడి పాత్ర రివీల్..
ఇకపోతే ఇదివరకే ఈ సినిమాలో ఈయన ఒక సాలిడ్ రోల్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా దివ్యేందు శర్మ పుట్టినరోజు కావడంతో.. మరో స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో క్రికెట్ బాలు పట్టుకొని మంచి మాస్ రగ్గ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో దివ్యేందు శర్మ కనిపించనున్నట్టు మేకర్స్ ఈయన పాత్ర పై కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఈయనపై వచ్చిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman)సంగీతం అందిస్తూ ఉండగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా నుండి తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అభిమానులలో మంచి హైప్ క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.
also read:Bigg Boss: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ..అంత తొందరెందుకో!
రామ్ చరణ్ సినిమాలు..
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. గతంలో రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేసి డిజాస్టర్ ను మూట గట్టుకున్నారు. ఇప్పుడు పెద్ది సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.
Happiest Birthday To Our RAM BUJJI @Divyenndu 🔥#PEDDI pic.twitter.com/uMTcnxPgWU
— PEDDI (@PeddiMovieOffl) June 19, 2025