Facebook Reels| ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్‌బుక్ తన వీడియో షేరింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో, అది షార్ట్స్ ఫార్మాట్ చిన్న క్లిప్ అయినా లేదా లెంగ్తీ ఫార్మాట్ వీడియో అయినా.. ఇకపై ‘రీల్స్’ ఫార్మాట్‌లోనే దాన్ని ఫేస్ బుక్ స్వీకరిస్తుంది. అన్ని వీడియోలు రీల్స్ ఎకోసిస్టమ్‌లో ఒకే రకమైన ఫీచర్లు, టూల్స్, డిస్కవరీ ఆప్షన్లతో కనిపిస్తాయి. ఈ మార్పు యూజర్లకు కొత్త అనుభవాన్ని అందించనుంది. గతంలో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇదే తరహా మార్పులు చేసింది.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటా సంస్థ తమ బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ధృవీకరించింది. “మీ ఆసక్తి, అభిరుచులకు తగినట్లు, విభిన్న క్రియేటర్ల నుంచి వచ్చే వివిధ డ్యూరేషన్ ఉన్న రీల్స్‌ను మీరు ఫేస్‌బుక్‌లో చూస్తూనే ఉంటారు,” అని వారు పేర్కొన్నారు.
ఎందుకు ఈ మార్పు?
2022లో ఇన్‌స్టాగ్రామ్ 15 నిమిషాల కంటే తక్కువ ఉన్న వీడియోలను రీల్స్‌గా మార్చిన విధానాన్ని ఫేస్‌బుక్ ఇప్పుడు అనుసరిస్తోంది. మెటా సంస్థకు చెందిన అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఒకే రకమైన అనుభవాన్ని అందించాలని భావిస్తోంది. దీని వల్ల యూజర్లకు ఒకే తరహా ఫార్మాట్ వీడియోల సౌలభ్యం ఉండడమే కాకుండా, ఏఐ (AI) ఆధారిత వీడియో సిఫార్సులు, ఎడిటింగ్ టూల్స్ వాడకం పెరుగుతుంది.
కొత్త క్రియేటివ్ టూల్స్
ఇక నుంచి అన్ని వీడియోలు రీల్స్‌గా మారడంతో, యూజర్లకు మరిన్ని క్రియేటివ్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి. వీటిలో:
ఈ టూల్స్ క్రియేటర్లకు చాలా ప్రయోజనకరంగా మారుతాయి. వీడియో పొడవు ఎంతైనా, వారు రీల్స్ టూల్‌కిట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు, ఫార్మాట్‌ల మధ్య మారాల్సిన అవసరం లేదు.
ప్రైవసీ, ఆడియన్స్ సెట్టింగ్స్
రీల్స్, సాధారణ ఫీడ్ పోస్టుల కోసం ఆడియన్స్ సెట్టింగ్స్ ఇప్పుడు ఒకేలా ఉంటాయి. గతంలో వీడియోలు, రీల్స్‌కు వేర్వేరు ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నవారిని, తమ ప్రాధాన్యతలను ధ్రువీకరించమని ఫేస్‌బుక్ కోరనుంది. అయితే, ప్రైవసీ ఆప్షన్స్‌లో ఎలాంటి మార్పు లేదు. మీ రీల్స్‌ను స్నేహితులు, మీకు నచ్చిన గ్రూప్‌లలో, లేదా అందరూ చూసేలా సెట్ చేసుకోవచ్చు.
Also Read: వాట్సాప్‌లో చాట్‌జిపిటి.. ఇక ఇమేజ్ జెనెరేట్ చేయడం మరింత ఈజీ
దశలవారీగా అమలు కానున్న మార్పు
ఈ మార్పు ఒకేసారి జరగదు. వచ్చే కొన్ని నెలల్లో ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని మెటా తెలిపింది. క్రియేటర్లు, సామాన్య వినియోగదారులు కొత్త ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు తగిన సమయం ఉంటుంది.
ఈ మార్పు ఫేస్‌బుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. క్రియేటర్లకు సృజనాత్మకతను పెంచే అవకాశం, వినియోగదారులకు సరళమైన అనుభవం లభిస్తాయి.