E-Paper
Advertisement

రుచిలో అదుర్స్!చిక్కటి గ్రేవీతో గోబీ మసాలా కర్రీ

రుచిలో అదుర్స్!చిక్కటి గ్రేవీతో గోబీ మసాలా కర్రీ
Advertisement

Cauliflower gravy curry: వీకెండ్ వచ్చిందంటే చాలు, ఇంట్లో ఏదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తుంది. బయట ఆర్డర్ చేసే.. బదులు ఇంట్లోనే ఫ్రెష్‌గా, హెల్తీగా, అదే సమయంలో.. రెస్టారెంట్‌ను మించిన రుచితో కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేస్తే ఆ మజానే వేరు. చాలా మంది కాలీఫ్లవర్‌తో డ్రై ఫ్రై లేదా పకోడీ చేస్తారు కానీజజ ఫుల్ గ్రేవీ కర్రీ మాత్రం అందరికీ అంతగా అలవాటు ఉండదు. ఒక్క సారి ఈ పద్ధతిలో చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్లందరూ ఇదే రెసిపీ మళ్లీ చేయమని అడుగుతారు.

కావాల్సిన పదార్థాలు:

కాలీఫ్లవర్ ముక్కలు: 2 కప్పులు

Advertisement

ఉల్లిపాయలు: 2

టమాటోలు: 2

Advertisement

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్

జీడిపప్పు లేదా వేయించిన పల్లీలు: 8 నుంచి 10

నూనె: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

పోపు దినుసులు: జీలకర్ర అర టీస్పూన్, లవంగాలు 3, దాల్చినచెక్క చిన్న ముక్క, యాలకులు 2

కారం: 1.5 టీస్పూన్లు

ధనియాల పొడి: 1 టీస్పూన్

జీలకర్ర పొడి: అర టీస్పూన్

పసుపు: పావు టీస్పూన్

గరం మసాలా: అర టీస్పూన్

కసూరి మేతి: 1 టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు: కొద్దిగా

వేడి నీళ్లు: గ్రేవీకి తగ్గట్టుగా

తయారీ విధానం:

1.ముందుగా గ్రేవీ కోసం బేస్ రెడీ చేసుకుందాం. జీడిపప్పు లేదా వేయించిన పల్లీలను కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఈ రోజుల్లో హెవీ క్రీమ్ వాడకుండానే నేచురల్‌గా చిక్కటి గ్రేవీ వచ్చేలా చేసుకోవాలి.ముందుగా పాన్‌లో నూనె వేసి జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలిపితే మంచి వాసన వస్తుంది.

2.తర్వాత టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలే దాకా ఉడికించాలి. ఇక్కడే అసలైన మసాలా మ్యాజిక్ మొదలవుతుంది. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, అలాగే ముందుగా రుబ్బిన జీడి పప్పు లేదా పల్లీ పేస్ట్ వేసి లో ఫ్లేమ్‌లో కలపాలి. మసాలాలు మాడి పోకుండా కొద్దిగా నీళ్లు వేస్తే గ్రేవీ కలర్, టెక్స్చర్ అద్భుతంగా వస్తాయి.A

Also Read: నోరూరించే పప్పురొయ్య వంకాయ కూర..పాతకాలపు రుచితో సింపుల్‌,టేస్టీగా!

3.ఇప్పుడు సిద్ధంగా ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను గ్రేవీలో వేసి మసాలా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేడి నీళ్లు పోసుకోవాలి. చన్నీళ్ల కంటే.. వేడి నీళ్లు పోయడం వల్ల గ్రేవీ టేస్ట్ చెడి పోకుండా, కుకింగ్ ప్రాసెస్ స్మూత్‌గా సాగుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో.. ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికిస్తే.. కాలీఫ్లవర్ లోపలి దాకా మసాలా రుచి చేరుతుంది.

4.ముక్కలు మెత్తబడి, గ్రేవీ చిక్కగా మారాక చివరగా గరం మసాలా, కసూరి మేతి నలిపి వేయాలి. కసూరి మేతి వల్ల ఈ కర్రీకి అచ్చం రెస్టారెంట్ గ్రేవీ ఫీల్ వస్తుంది. చివర్లో తాజా కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే వేడివే డి కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో కలుపుకున్నా, నెయ్యి రాసిన చపాతీ లేదా బగారా రైస్‌తో తిన్నా సూపర్‌గా ఉంటుంది.

Related News

చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్.. ఇంట్లోనే రుచికరమైన మునక్కాయ సూప్ ఇలా చేసుకోండి!

చెరువు అవసరం లేదు? ఇంట్లోనే తామర పువ్వులు పెంచుకోవడానికి ఈజీ టిప్స్

ఆఫీస్ మీటింగ్స్, ఇంటర్వ్యూలలో తడబడుతున్నారా? మీ మాటతీరును మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే!

కూరగాయలంటే పారిపోయే పిల్లలు కూడా.. ఈ 4 వెరైటీలు చేసి పెడితే మళ్లీ మళ్లీ అడిగి తింటారు!

మన తలరాతను మార్చే శక్తి మనలోనే ఉందా? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుత సందేశం

చలికాలంలో స్వెటర్ వేసుకుంటే లావుగా కనిపిస్తున్నారా? స్లిమ్‌ అండ్ స్టైలిష్‌గా కనిపించడానికి టిప్స్

ప్రేమ కోసం ఖరీదైన బహుమతులు అవసరం లేదు.. ఈ చిన్న పనులు చేస్తే చాలంటున్న జెన్ Z

Big Stories

Advertisement
×