Communication Skills: నేటి పోటీ ప్రపంచంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. జాబ్ ఇంటర్వ్యూ అయినా, ఆఫీస్ మీటింగ్ అయినా, లేదా ఫ్రెండ్స్‌తో క్యాజువల్‌గా మాట్లాడేటప్పుడైనా మన ఆలోచనలను ఎదుటివారికి స్పష్టంగా చెప్పగలగాలి. అయితే, కమ్యూనికేషన్ అంటే కేవలం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం మాత్రమే కాదు. మన బాడీ లాంగ్వేజ్, వినే ఓపిక, ఆత్మవిశ్వాసం కూడా ఇందులో భాగమే. దీనికోసం ఖరీదైన కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో పాటించే 5 చిన్న అలవాట్లతో మీరు అద్భుతమైన వక్తగా మారవచ్చు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రోజూ ఒక చిన్న టాపిక్ ఎంచుకుని రెండు మూడు నిమిషాల పాటు సహజంగా మాట్లాడి, దాన్ని మీ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయండి. తర్వాత ఆ వీడియోను జాగ్రత్తగా గమనించండి. మీ స్పీడ్, ఉచ్చారణ, హావభావాలు ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఎక్కడ తడబడుతున్నారో గుర్తించి, తర్వాతి వీడియోలో సరిదిద్దుకోండి. ఇది కెమెరా భయాన్ని పోగొడుతుంది.
వేగంగా మాట్లాడినంత మాత్రాన కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు కాదు. గబగబా మాట్లాడితే ఎదుటివారికి అర్థం కాదు. కాబట్టి కంగారు పడకుండా ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడండి. ఎవరైనా ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా, రెండు సెకన్లు ఆగి ఆలోచించి బదులివ్వండి. ఆ చిన్న విరామం మీ మాటలకు మరింత బలాన్ని ఇస్తుంది.
Also Read: కూరగాయలంటే పారిపోయే పిల్లలు కూడా.. ఈ 4 వెరైటీలు చేసి పెడితే మళ్లీ మళ్లీ అడిగి తింటారు!
మాట్లాడేటప్పుడు మధ్యలో ఊతపదాలు వాడటం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత తగ్గుతుంది. వీటికి బదులుగా కాసేపు మౌనంగా ఉండటం మంచిది. అలాగే రోజుకు కనీసం 15 నిమిషాలు న్యూస్ పేపర్లు లేదా పుస్తకాలు చదవండి. కొత్త పదాలను నేర్చుకుని, వాటిని మీ రోజువారీ సంభాషణల్లో ఉపయోగించడానికి ప్రయత్నించండి.
ప్రతిరోజూ ఐదు నుంచి పది నిమిషాల పాటు అద్దం ముందు నిలబడి మీకు తెలిసిన ఏదైనా అంశం గురించి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మీ కళ్లు, చేతుల కదలికలు, నిలబడే విధానాన్ని గమనించుకోండి. కిందకు చూడకుండా నేరుగా కళ్లలోకి చూస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఇది ఇంటర్వ్యూల సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది.
మంచి కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటమే కాదు.. వినడం కూడా. చాలామంది ఎదుటివారు మాట్లాడుతుండగానే మధ్యలో అడ్డుపడుతుంటారు. అలా కాకుండా వారు చెప్పేది పూర్తిగా విన్నాకే మీ సమాధానం చెప్పండి. ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు వినడం ద్వారా వివిధ రకాల యాసలు, మాట్లాడే శైలిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక్క రాత్రిలో వచ్చేవి కావు. ఓపికతో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తేనే మార్పు సాధ్యమవుతుంది.
Also Read: ఎక్కువ కష్టపడకుండా నడకతోనే వారంలో కిలో బరువు తగ్గించే సింపుల్ ఫార్ములా ఇదే!