Winter sweater styling tips| చలికాలం వచ్చిందంటే చాలు.. స్వెటర్లు, జాకెట్లు, వెచ్చని దుస్తులు ధరించడం మొదలుపెడతాం. అయితే కొన్నిసార్లు ఎంత మంచి స్వెటర్ వేసుకున్నా అద్దంలో చూసుకుంటే లావుగా కనిపిస్తున్నామనే భావన కలుగుతుంది. అలాగని మీకు ఇష్టమైన స్వెటర్లను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న స్టైలింగ్ మార్పులు చేసుకుంటే చలికి రక్షణ పొందుతూనే స్లిమ్‌గా, అందంగా కనిపించవచ్చు. మరి ఈ వింటర్‌లో మీకు స్లిమ్ లుక్ మార్చే 7 సులభమైన ఫ్యాషన్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం.
స్వెటర్ కొనేటప్పుడు దాని ఫిట్టింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మరీ వదులుగా ఉండే స్వెటర్లు శరీర ఆకృతిని దాచేసి లావుగా కనిపించేలా చేస్తాయి. అలాగే మరీ బిగుతుగా ఉండే స్వెటర్లు కూడా అసౌకర్యంగా ఉంటాయి. కాబట్టి భుజాలు, నడుము దగ్గర సరిగ్గా సరిపోయే స్వెటర్లు ఎంచుకోండి. లూజ్ స్వెటర్ వేసుకుంటే కింద ఫిట్టింగ్ జీన్స్ లేదా ట్రౌజర్ ధరించండి.
స్వెటర్ వేసుకున్నప్పుడు నడుము, పొట్ట భాగం ఎక్కువగా కనిపిస్తోందని అనిపిస్తే హై వెయిస్ట్ జీన్స్ ట్రై చేయండి. ఇవి నడుము పైభాగం వరకు ఉండి మంచి కవరేజ్ ఇస్తాయి. కొంచెం పొడవైన స్వెటర్ అయితే ముందు భాగాన్ని జీన్స్‌లోకి స్వల్పంగా టక్ చేయండి. దీనివల్ల నడుము షేప్ చక్కగా కనిపిస్తుంది.
ఒకే కలర్‌కు చెందిన దుస్తులు ధరించడం వల్ల లుక్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఉదాహరణకు బ్లాక్ స్వెటర్‌తో బ్లాక్ జీన్స్, గ్రే స్వెటర్‌తో గ్రే ట్రౌజర్ వేసుకోవచ్చు. బ్రౌన్, బీజ్ రంగులను కూడా కలిపి ధరించవచ్చు. మ్యాచింగ్ షూస్, బ్యాగ్‌తో మీ స్టైల్ మరింత అందంగా మార్చుకోవచ్చు.
రౌండ్ నెక్ స్వెటర్లకు బదులుగా వీ నెక్ స్వెటర్లను ప్రయత్నించండి. వీటి వల్ల మెడ భాగం మరింత పొడవుగా కనిపిస్తుంది. వీటి లోపల పలుచని థర్మల్ టాప్ ధరిస్తే బాగుంటుంది. జీన్స్, ట్రౌజర్స్, లాంగ్ స్కర్ట్స్‌తో వీటిని స్టైల్ చేసుకోవచ్చు. చిన్న చైన్ లేదా పెండెంట్ కూడా అందంగా ఉంటుంది.
ఒకే మందపాటి స్వెటర్ వేసుకోవడం కంటే పలుచని దుస్తులతో లేయరింగ్ చేయడం మంచిది. ముందుగా థర్మల్ టాప్, దానిపై పలుచని స్వెటర్ ధరించండి. అవసరమైతే చివరగా జాకెట్ లేదా కోట్ వేసుకోండి. ఇలా చేస్తే వెచ్చదనంతో పాటు స్టైలిష్ లుక్ కూడా సొంతమవుతుంది.
నడుము కంటే కింద వరకు వచ్చే లాంగ్ జాకెట్లు, ఓపెన్ కార్డిగన్ మంచి ఎంపిక. వీటిని ముందు భాగం తెరిచి ధరించడం వల్ల నిలువుగా ఉండే లైన్లు ఏర్పడి శరీరం పొడవుగా కనిపిస్తుంది. జీన్స్, ట్రౌజర్స్‌తో వీటిని వేసుకోండి. మరీ ఉబ్బుగా ఉండే డిజైన్లకు దూరంగా ఉండండి.
Also Read: బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి మంచి డ్రెస్ కావాలా? అబ్బాయిలు, అమ్మాయిల కోసం స్టైలిష్ అవుట్‌ఫిట్స్ చూడండి
స్కార్ఫ్ చలి నుంచి రక్షించడమే కాకుండా మీ లుక్ కూడా మార్చేస్తుంది. దీన్ని మెడ చుట్టూ ఒకసారి వేసి రెండు అంచులను ముందువైపు వదిలేయండి. ప్లెయిన్ స్వెటర్‌తో కలర్‌ఫుల్ స్కార్ఫ్, డిజైన్ ఉన్న స్వెటర్‌తో సింపుల్ స్కార్ఫ్ ధరించండి. మెడ చుట్టూ మరీ ఎక్కువగా చుట్టకుండా చూసుకోండి.
Also Read: మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్
చలికాలంలో స్టైలిష్‌గా కనిపించడానికి ఖరీదైన దుస్తులు కొనాల్సిన అవసరం లేదు. సరైన ఫిట్టింగ్, కలర్ కాంబినేషన్లు, లేయరింగ్ పద్ధతులు పాటిస్తే చాలు. మీకు నచ్చిన స్వెటర్లతోనే అందంగా, ఆత్మవిశ్వాసంతో ఈ వింటర్‌ను ఆస్వాదించవచ్చు.